సినీ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు సునీల్ (Sunil)ఒకరు.వరుస సినిమాలలో కమెడియన్ పాత్రలలో నటిస్తూ సక్సెస్ అయిన సునీల్అనంతరం హీరోగా మారారు.
ఇక హీరోగా కూడా పలు సినిమాలలో చేశారు కానీ పెద్దగా సక్సెస్ రాకపోవడంతో తిరిగి సినిమాలలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు.ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ సునీల్ ఎంతో బిజీగా ఉన్నారు.
పుష్ప (Pushpa)సినిమాతో విలన్ గా ప్రూవ్ చేసుకున్నాడు.దాని తర్వాత కూడా చాలా సినిమాల్లో విలన్ పాత్రలు చేస్తున్నాడు.

ఇదిలా ఉండగా తాజాగా సునీల్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా టాలీవుడ్ యంగ్ హీరో పై ఈయన ప్రశంసల వర్షం కురిపించారు.సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా కోసం మరొక హీరోలు సపోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది.ఇలా ఏ హీరో మంచిగా సపోర్ట్ చేస్తారు అనే ప్రశ్న ఈయనకు ఎదురయింది.
ఈ ప్రశ్నకు సునీల్ చెప్పిన సమాధానం సంచలనగా మారింది.

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎవరైనా సినిమా వేడుక కోసం ఆహ్వానిస్తే చిరంజీవి(Chiranjeevi) గారు వెంటనే వచ్చేసి ఆ హీరోకి ఆ సినిమాకి పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతారు.అయితే చిరంజీవి తర్వాత అంతటి గొప్ప వ్యక్తి నాని(Nani) అని తెలిపారు.నాని ఎంత బిజీగా ఉన్నా సరే ఒక సినిమా ఫంక్షన్ కు పిలవగానే కచ్చితంగా రెస్పాండ్ అవుతాడు.
తన షూటింగ్ ఏ రోజు ఉంది.ఏ టైమ్ దాకా షూటింగ్ లో ఉండి ఫంక్షన్ కు వస్తాడు అనేది పూర్తిగా చెప్తాడు.
ఒక స్టార్ హీరో అంత క్లియర్ గా తన షెడ్యూల్ మొత్తం చెప్పాల్సిన పనిలేదు కానీ నాని ఒక బాధ్యతగా భావించి అన్ని విషయాలు చెబుతారని సునీల్ తెలిపారు.నాని భవిష్యత్తులో కచ్చితంగా ఒక స్టార్ హీరోగా ఒక స్టార్ డైరెక్టర్ గా ఎదుగుతారు అంటూ సునీల్ నాని పై ప్రశంసలు కురిపించారు.