టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటులలో హర్షవర్ధన్( Harsha Vardhan ) ఒకరు.అమృతం సీరియల్ తో ఓవర్ నైట్ లో పాపులర్ అయిన హర్షవర్ధన్ సినిమాలలో విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ ఆ పాత్రలకు తన వంతు న్యాయం చేస్తున్నారు.
హీరో నితిన్ కు( Hero Nithin ) అత్యంత సన్నిహితులలో హర్షవర్ధన్ ఒకరు కాగా గుండె జారి గల్లంతయ్యిందే( Gunde Jaari Gallanthayyinde ) సినిమా ఈవెంట్ లో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ఆయన చెప్పుకొచ్చారు.
గుండెజారి గల్లంతయ్యిందే మూవీ ఈవెంట్ లో స్టేజ్ పైకి వెళ్లి మాట్లాడాలని అనుకున్నానని యాంకర్ హర్షవర్ధన్ అని పిలిస్తే నేనే అనుకుని లేచానని బాలీవుడ్ హీరో హర్షవర్ధన్ రాణే( Harshvardhan Rane ) టకటకా వెళ్లి లేచి మాట్లాడాడని అన్నారు.
రైటర్ అయి ఉండి నన్ను పిలవలేదేంటని నా పక్కన ఉన్నవాళ్లు నాతో అన్నారని హర్షవర్ధన్ చెప్పుకొచ్చారు.నన్ను పిలుస్తారేమోనని చివరిదాకా వెయిట్ చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆయన తెలిపారు.

నితిన్ నా ప్రాబ్లమేంటి అని అడగగా నన్ను పిలవకపోవడం బాధగా అనిపించిందని చెప్పానని నీ పేరు పిలిస్తే మరో నటుడు స్టేజ్ పైకి వచ్చాడని నితిన్ వెల్లడించారని హర్షవర్ధన్ అన్నారు.స్టేజ్ పై ఉన్నవాళ్లందరినీ గుర్తు పెట్టుకోవడం, మాట్లాడటం ఎంత కష్టమో నువ్వు మైక్ పట్టుకున్నప్పుడు తెలుస్తుందని నితిన్ చెప్పాడని నాకు అసలు విషయం అర్థమైందని హర్షవర్ధన్ అన్నారు.

ఆ సమయంలో నితిన్ నాకు సారీ చెప్పడం కాదు నేను కదా నితిన్ కు సారీ చెప్పాలని అనిపించిందని నేను ఇంత తప్పు చేశానేంటని అనుకున్నానని హర్షవర్ధన్ పేర్కొన్నారు.ఆ విషయంలో నన్ను నేను ఈరోజుకూ క్షమించుకోలేనని నితిన్ ఇదంతా ఎప్పుడో మరిచిపోయి ఉండొచ్చని ఆయన వెల్లడించారు.హీరో నితిన్ మరికొన్ని రోజుల్లో రాబిన్ హుడ్( Robinhood Movie ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.