ప్రస్తుత సమ్మర్( Summer ) సీజన్ లో ప్రధానంగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో స్కిన్ టాన్( Skin Tan ) ఒకటి.కాసేపు ఎండలో తిరిగామంటే చాలు చర్మం నల్లగా, కాంతిహీనంగా మారిపోతుంటుంది.
అటువంటి చర్మాన్ని అద్దంలో చూసుకోవడానికి కూడా ఇష్టపడరు.ఈ క్రమంలోనే టాన్ అయిన చర్మాన్ని రిపేర్ చేసుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు.
కొందరు బ్యూటీ పార్లర్ కు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ పవర్ ఫుల్ ఇంటి చిట్కాలను కనుక పాటిస్తే కేవలం 20 నిమిషాల్లోనే టాన్ అయిన ఫేస్ ను ప్రిపేర్ చేసుకోవచ్చు.
మరి ఇంతకీ ఆ ఇంటి చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్( Green Tea Powder ) వేసుకోవాలి.అలాగే వన్ టీ స్పూన్ కాఫీ పౌడర్,( Coffee Powder ) వన్ టీ స్పూన్ పెరుగు,( Curd ) వన్ టీ స్పూన్ రోజ్ వాటర్( Rose Water ) వేసుకుని అన్ని కలిసేలా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఈ లోపు స్కిన్ అనేది పూర్తిగా డ్రై అవుతుంది.అప్పుడు ఒక ఐస్ క్యూబ్ ను తీసుకొని చర్మాన్ని సున్నితంగా రాబ్ చేసుకోవాలి.
ఫైనల్ గా వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఈ విధంగా కనుక చేశారంటే ఎండ వల్ల టాన్ అయిన చర్మం మళ్లీ మునపటి మెరుపును పొందుతుంది.
స్కిన్ వైట్ గా, బ్రైట్ గా మారుతుంది.టాన్ తో పాటు డెడ్ స్కిన్ సెల్స్ ను కూడా ఈ రెమెడీ తొలగిస్తుంది.
చర్మాన్ని అందంగా కాంతివంతంగా మెరిపిస్తుంది.

టాన్ సమస్యను తొలగించడానికి మరొక సూపర్ రెమెడీ ఉంది.దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టీ స్పూన్ కాఫీ పౌడర్, వన్ టీ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి.అలాగే రెండు టీ స్పూన్లు టమాటో ప్యూరీ, వన్ టీ స్పూన్ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖనికి మెడకు అప్లై చేసుకుని ఆరబెట్టుకోవాలి.పూర్తిగా డ్రై అయ్యాక వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఈ రెమెడీని పాటించిన కూడా ఎండ వల్ల పాడైన చర్మం మళ్లీ తెల్లగా కాంతివంతంగా మారుతుంది.