అల్లు అర్జున్ త్రివిక్రమ్ (allu arjun trivikram)కాంబినేషన్ లో మూడు సినిమాలు తెరకెక్కగా ఆ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి.జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలు అటు బన్నీకి ఇటు త్రివిక్రమ్ కు కెరీర్ పరంగా చాలా ప్లస్ అయ్యాయి.
అయితే బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ స్టోరీ లైన్ కు సంబంధించి షాకింగ్ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
దేవుడు కార్తికేయను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని ఈ సినిమా న భూతో న భవిష్యత్ అనేలా ఉంటుందని బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా చరిత్ర సృష్టించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
బన్నీని ఈ సినిమాలో మరోసారి సరికొత్త పాత్రలో చూడబోతున్నామని సమాచారం అందుతోంది.బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ పాన్ ఇండియా మూవీగా విడుదల కానుండగా ఈ సినిమా ఇతర భాషల ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ 700 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని తెలుస్తోంది.బన్నీ త్రివిక్రమ్ కాంబో ఇతర భాషల ప్రేక్షకులను సైతం మెప్పించనుందని తెలుస్తోంది.మైథలాజికల్ టచ్ తో అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతోంది.

అల్లు అర్జున్ భాషతో సంబంధం లేకుండా రికార్డులు క్రియేట్ చేయాలని నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.బన్నీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.సోషల్ మీడియాలో సైతం బన్నీ క్రేజ్ ను పెంచుకుంటున్నారు.అల్లు అర్జున్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.బన్నీ భవిష్యత్తు సినిమాలతో ఏ స్థాయిలో హిట్లు సాధిస్తారో చూడాల్సి ఉంది.