మామూలుగా పెద్ద పెద్ద సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే సినిమా టికెట్ల రేట్లు పెంచడం అన్నది కామన్.చిన్న సినిమాలకు సినిమా టికెట్ల రేట్లు పెంచడం అన్నది చాలా వరకు జరగదు.
పెద్ద సినిమాల బడ్జెట్ లు ఎక్కువ కాబట్టి సినిమా రేట్లు పెంచుతూ ఉంటారు.అయితే ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా మ్యాడ్ స్క్వేర్ ( Mad Square )అలాగే రాబిన్ హుడ్ లాంటి సినిమాలకు టికెట్లు రేట్లు పెంచారు.
ఈ విషయం ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ( Telugu film industry )హాట్ టాపిక్ గా మారింది.చిన్న సినిమాలకు కూడా టికెట్లు రేట్లు పెంచాలి అంటూ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు అదే విషయాన్ని అమలు చేశారని చెప్పాలి.

బడ్జెట్ తో సంబంధం లేకుండా హైప్ ఆధారంగా టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు తీసుకొచ్చారేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కాగా త్వరలోనే విడుదల కాబోతున్న ఈ రెండు సినిమాలపై ప్రస్తుతం మంచి హైప్ ఉంది.దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఇలా టికెట్ రేట్లు పెంచి ఉంటారని చెప్పవచ్చు.
అయితే టికెట్ పై పెంచింది కేవలం 75 రూపాయలే కదా దానికి ఇంత రాద్దాంతం ఎందుకు అని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు.ఇక్కడ సమస్య 50 రూపాయలు పెంచారా 75 రూపాయలు పెంచారా అనేది కాదు, చిన్న సినిమాలకు టికెట్లు రేట్లు ఎందుకు పెంచారు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

కాగా మ్యాడ్ స్క్వేర్ చిన్న సినిమా అనే సంగతి అందరికీ తెలిసిందే.ఇక రాబిన్ హుడ్ ( Robin Hood )సినిమాకు కూడా నితిన్ మార్కెట్ కు తగ్గట్టే బడ్జెట్ పెట్టారు.కాకపోతే ఈసారి ఇంకాస్త ఎక్కువ ఖర్చు అయ్యింది.అంతేతప్ప అది భారీ బడ్జెట్ సినిమా కాదు, భారీగా గ్రాఫిక్స్ ఉపయోగించిన మూవీ అంతకంటే కాదు.అయినప్పటికీ ఏపీలో టికెట్ రేట్లు పెంచేశారు.అయితే టికెట్ల రేట్లు పెంపు అన్నది కేవలం ఈ రెండు సినిమాల విషయంలోనే ఉంటుందా? ఇకమీదట విడుదల అయ్యే చిన్న సినిమాల విషయంలోనూ ఇదే వర్తిస్తుందా అన్నది చూడాలి మరి