ఆ సినిమా ఫ్లాప్ అయితే తన జీవితం మరోలా ఉండేదన్న అశ్వనీదత్..

జగదేక వీరుడు అతిలోక సుందరి.తెలుగు సినిమా పరిశ్రమలో బిగ్గెస్ట్ హిట్.

 Ashwini Dutt About His Career Up And Downs , Ashwini Dutt, Chirenjeevi, Sridevi,-TeluguStop.com

చిరంజీవి కెరీర్ లో మైల్ స్టోన్.అంతేకాదు.

టాలీవుడ్ టాప్ టెన్ సినిమాల్లో ఈ సినిమా కచ్చితంగా ఉండి తీరుతుందనే చెప్పుకోవచ్చు.ఈ సినిమాతో చిరంజీవికి ఓరేంజిలో పేరొచ్చింది.

ఈ సినిమాతో టాలీవుడ్ లో తిరుగులేని నటుడిగా మారిపోయాడు చిరంజీవి.తాజాగా ఈ సినిమాకు మూడు దశాబ్దాలు నిండాయి.

ఈ సందర్భంగా ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.సినిమా పరిశ్రమలోని పెద్దలంతా ఈ సినిమా విశేషాలను గురించి మాట్లాడుతున్నారు.

తాజాగా ఈ సినిమా గురించి నిర్మాత అశ్వినిదత్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించాడు.ఇంతకీ ఆయన చెప్పిన రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఈ సినిమాలో నటించిన చిరంజీవి, శ్రీదేవికి ఇచ్చిన పారితోషకం ఎంత? ఈ సినిమా వసూలు చేసిన డబ్బులు ఎన్ని అనే విషయాలను వెల్లడించాడు.ఈ సినిమాకు అప్పట్లోనే చిరంజీవికి రూ.35 లక్షలు ఇచ్చినట్లు చెప్పాడు.అటు హీరోలతో సమాన స్థాయిలో గుర్తింపు ఉన్న శ్రీదేవికి సైతం భారీగానే డబ్బు ముట్టజెప్పినట్లు వెల్లడించాడు.ఆమెకు అప్పట్లోనే రూ.25 లక్షల పారితోషికం అందజేసినట్లు వెల్లడించాడు.ఈ సినిమాకు ఖర్చలు గట్రా పోను తనకు రూ.35 లక్షలు మిగిలినట్లు చెప్పాడు.

Telugu Ashwini Dutt, Ashwinidutt, Chirenjeevi, Jagadekaveeru, Sridevi, Tollywood

ఇప్పుడు 35 లక్షల రూపాయలు అంటే చాలా చిన్న మొత్తంగా అనిపిస్తున్నా.అప్పుడు ఈ విలువ కోట్లల్లో ఉంటుందని చెప్పాడు.అప్పటి రేటు ప్రకారం బాల్కానీ రేటు కేవలం రూ.6 అని వెల్లడించాడు.ఈ సినిమాను బంఫర్ హిట్ సినిమా లెక్కన భావించాలని వెల్లడించాడు.ఇప్పటితో పోలిస్తే వందల కోట్ల లాభం వచ్చినట్లు అన్నారు.ఆ సమయంలోనే ఈ సినిమా రూ.78 కోట్ల షేర్ వసూలు చేసినట్లు వెల్లడించారు.తన దగ్గరున్న డబ్బు మొత్తం పెట్టి ఈ సినిమా చేశానని చెప్పాడు.అయితే తన నమ్మకాన్ని నిలబెట్టిందని చెప్పాడు.ఈ సినిమా ఫ్లాప్ అయితే తన జీవితం తలకిందులు అయ్యేదన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube