ఆ సినిమా ఫ్లాప్ అయితే తన జీవితం మరోలా ఉండేదన్న అశ్వనీదత్..
TeluguStop.com
జగదేక వీరుడు అతిలోక సుందరి.తెలుగు సినిమా పరిశ్రమలో బిగ్గెస్ట్ హిట్.
చిరంజీవి కెరీర్ లో మైల్ స్టోన్.అంతేకాదు.
టాలీవుడ్ టాప్ టెన్ సినిమాల్లో ఈ సినిమా కచ్చితంగా ఉండి తీరుతుందనే చెప్పుకోవచ్చు.
ఈ సినిమాతో చిరంజీవికి ఓరేంజిలో పేరొచ్చింది.ఈ సినిమాతో టాలీవుడ్ లో తిరుగులేని నటుడిగా మారిపోయాడు చిరంజీవి.
తాజాగా ఈ సినిమాకు మూడు దశాబ్దాలు నిండాయి.ఈ సందర్భంగా ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
సినిమా పరిశ్రమలోని పెద్దలంతా ఈ సినిమా విశేషాలను గురించి మాట్లాడుతున్నారు.తాజాగా ఈ సినిమా గురించి నిర్మాత అశ్వినిదత్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించాడు.
ఇంతకీ ఆయన చెప్పిన రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.ఈ సినిమాలో నటించిన చిరంజీవి, శ్రీదేవికి ఇచ్చిన పారితోషకం ఎంత? ఈ సినిమా వసూలు చేసిన డబ్బులు ఎన్ని అనే విషయాలను వెల్లడించాడు.
ఈ సినిమాకు అప్పట్లోనే చిరంజీవికి రూ.35 లక్షలు ఇచ్చినట్లు చెప్పాడు.
అటు హీరోలతో సమాన స్థాయిలో గుర్తింపు ఉన్న శ్రీదేవికి సైతం భారీగానే డబ్బు ముట్టజెప్పినట్లు వెల్లడించాడు.
ఆమెకు అప్పట్లోనే రూ.25 లక్షల పారితోషికం అందజేసినట్లు వెల్లడించాడు.
ఈ సినిమాకు ఖర్చలు గట్రా పోను తనకు రూ.35 లక్షలు మిగిలినట్లు చెప్పాడు.
"""/"/
ఇప్పుడు 35 లక్షల రూపాయలు అంటే చాలా చిన్న మొత్తంగా అనిపిస్తున్నా.
అప్పుడు ఈ విలువ కోట్లల్లో ఉంటుందని చెప్పాడు.అప్పటి రేటు ప్రకారం బాల్కానీ రేటు కేవలం రూ.
6 అని వెల్లడించాడు.ఈ సినిమాను బంఫర్ హిట్ సినిమా లెక్కన భావించాలని వెల్లడించాడు.
ఇప్పటితో పోలిస్తే వందల కోట్ల లాభం వచ్చినట్లు అన్నారు.ఆ సమయంలోనే ఈ సినిమా రూ.
78 కోట్ల షేర్ వసూలు చేసినట్లు వెల్లడించారు.తన దగ్గరున్న డబ్బు మొత్తం పెట్టి ఈ సినిమా చేశానని చెప్పాడు.
అయితే తన నమ్మకాన్ని నిలబెట్టిందని చెప్పాడు.ఈ సినిమా ఫ్లాప్ అయితే తన జీవితం తలకిందులు అయ్యేదన్నాడు.
ఎన్టీయార్ కెరియర్ ఇటు పోతుంది…దేవర ను మించి వార్ 2 ఉంటుందా..?