సాధారణంగా కొందరి దంతాలు పసుపు రంగులో గారపట్టేసి ఉంటాయి.ప్రతి రోజు ఉదయం, సాయంత్రం దంతాలను బ్రెష్‌తో తోముకున్నప్పటికీ ఈ సమస్య నుంచి బయట పడలేకపోతుంటారు.
ఈ క్రమంలోనే రకరకాల టూత్ పేస్ట్‌లను మారుస్తూ ఉంటారు.కొందరికి ఎన్ని చేసినా సరైన ఫలితం దక్కరు.
దాంతో ఇతరులతో మాట్లాడాలన్నా, హాయిగా అందరితో కలిసి నవ్వాలన్నా ఎంతో భయపడుతుంటారు.ఎవరైనా హేళన చేస్తారేమో అని నోరు తెరవడానికే ఇబ్బంది పడుతుంటారు.
ఈ లిస్ట్‌లో మీరు ఉన్నారా.? అయితే అస్సలు బాధపడకండి.ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని గనుక ట్రై చేస్తే మీ దంతాలు ముత్యాల్లా మెరిసిపోవడం ఖాయం.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేసేద్దాం పదండీ.
దంతాలను మెరిపించడానికి కాఫీ పౌడర్ అద్భుతంగా సహాయపడుతుంది.కాఫీ పౌడర్‌తోనే ఇప్పుడు రెమెడీని తయారు చేసుకోబోతున్నాము.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్సూన్ కాఫీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ మీ రెగ్యులర్ టూత్ పేస్ట్ వేసి బాగా కలపాలి.ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుని అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని యూస్ చేసి దంతాలను రెండంటే రెండు నిమిషాల పాటు సున్నితంగా తోముకోవాలి.ఆపై గోరు వెచ్చని నీటితో నోటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఈ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ రెమెడీని రోజుకు ఒక్క సారి పాటిస్తే గనుక ఎంత గారపట్టి పసుపు రంగులోకి మారిన దంతాలైనా తెల్లగా, ముత్తాల్లా మారతాయ.కాబట్టి, దంతాలు పసుపు రంగులో ఉంటే బాధపడటం, కృంగిపోవడం మానేసి ఈ సింపుల్ రెమెడీని ట్రై చేసేయండి.