పురుషుల్లో హెయిర్ గ్రోత్‌ను పెంచే సూప‌ర్ ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!

హెయిర్ గ్రోత్ లేక‌పోవ‌డం.స్త్రీల‌లోనే కాదు చాలా మంది పురుషుల్లోనూ క‌నిపించే కామ‌న్‌ స‌మ‌స్య ఇది.

 Effective Home Remedy To Improve Hair Growth In Men! Home Remedy, Improve Hair G-TeluguStop.com

హెయిర్ గ్రోత్ బాగుంటే జుట్టు ఊడుతున్నా చింతించాల్సిన ప‌ని ఉండ‌దు.ఎందుకంటే, ఊడిన చోట మ‌ళ్లీ జుట్టు వ‌చ్చేస్తుంటుంది.

కానీ, కొంద‌రిలో వెంట్రుక‌లు రాల‌డ‌మే త‌ప్పా మ‌ళ్లీ రావు.దాంతో జుట్టు ప‌ల్చ‌ బ‌డి పోతుంది.

పోష‌కాల కొర‌త‌, ఆహార‌పు అల‌వాట్లు, కాలుష్యం, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే హెయిర్ ప్రోడెక్ట్స్‌ను వాడ‌టం, మ‌ద్య‌పానం, ధూమ‌పానం వంటివే ఇందుకు ప్ర‌ధాన కార‌ణాలు.

అయితే కార‌ణం ఏదైనా ఇప్పుడు చెప్ప‌బోయే సూప‌ర్ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీని పురుషులు ట్రై చేస్తే గ‌నుక హెయిర్ గ్రోత్‌ను అద్భుతంగా పెంచుకోవ‌చ్చు.

మ‌రి ఆ రెమెడీ ఏంటి.? దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.? మ‌రియు ఏ విధంగా వాడాలి.? వంటి విష‌యాల‌ను లేట్ చేయ‌కుండా తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల క‌లోంజి సీడ్స్‌ను వేసి మెత్త‌గా పొడి చేసుకోవాలి.

ఇప్పుడు ఒక గాజు కంటైన‌ర్ తీసుకుని అందులో క‌లోంజి సీడ్స్ పౌడ‌ర్‌, ఒక క‌ప్పు కొబ్బ‌రి నూనె, రెండు టేబుల్ స్పూన్లు ఆముదం వేసి మూత పెట్టి.

మూడు వారాల పాటు ఎండ‌లో పెట్టుకోవాలి.ఆ త‌ర్వాత క‌లర్ ఛేంజ్ అయిన ఆయిల్‌ను మాత్రం వేరు చేసుకుని బాటిల్‌లో నింపుకోవాలి.

ఇక ఈ ఆయిల్‌ను రాత్రి నిద్రించే ముందు జుట్టుకు ప‌ట్టించి ప‌ది నిమిషాల పాటు మ‌సాజ్ చేసుకోవాలి.ఆపై ష‌వ‌ర్ క్యాప్ పెట్టుకుని నిద్రించి.ఉద‌యాన్నే మైల్డ్ షాంపూతో త‌ల‌స్నానం చేయాలి.మూడు రోజులకు ఒక‌సారి ఇలా చేస్తే హెయిర్ గ్రోత్ పెర‌గ‌డంతో పాటు జుట్టు రాల‌డమూ త‌గ్గు ముఖం ప‌డుతుంది.అదే స‌మ‌యంలో జుట్టు త్వ‌ర‌గా తెల్ల బ‌డ‌కుండా కూడా ఉంటుంది.

Effective Home Remedy To Improve Hair Growth In Men! Home Remedy, Improve Hair Growth, Men, Hair Care, Hair Care Tips, Beauty, Beauty Tips, Hair Problems - Telugu Tips, Care, Care Tips, Problems, Remedy, Improve

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube