పిరమిడ్ల కింద సీక్రెట్ సిటీ? ఈజిప్టులో బయటపడ్డ షాకింగ్ నిజం... ప్రపంచం విస్తుపోయేలా!

ఈజిప్టులోని గిజా పిరమిడ్ల ( Giza Pyramids in Egypt )కింద ఓ భారీ రహస్య నగరం బయటపడిందా? శాస్త్రవేత్తలు సంచలన ప్రకటన చేయడంతో ప్రపంచం ఒక్కసారిగా విస్తుపోయింది.అత్యాధునిక రాడార్ టెక్నాలజీతో వేలాది అడుగుల లోతున ఉన్న నిర్మాణాలు స్పష్టంగా కనిపించాయని వారు చెబుతున్నారు.

 The Shocking Truth Revealed In Egypt's Secret City Under The Pyramids Will Shock-TeluguStop.com

పురాతన రికార్డులు, రహస్యాలు దాగి ఉన్నాయని భావిస్తున్న ‘హాల్స్ ఆఫ్ అమెంటి’ గురించిన పుకార్లు నిజమయ్యేలా ఉన్నాయని అంటున్నారు.అయితే, పురావస్తు నిపుణులు మాత్రం ఈ వాదనలను కొట్టిపారేస్తున్నారు.

ఇది తప్పుదోవ పట్టించే సమాచారం అంటూ మండిపడుతున్నారు.

Telugu Giza Pyramids, Halls Amenti, Pyramid Secrets, Radar Discovery, Secret Egy

స్కాట్లాండ్‌లోని స్ట్రాత్‌క్లైడ్ యూనివర్సిటీకి ( University of Strathclyde in Scotland )చెందిన ఫిలిప్పో బియోండి, ఇటలీలోని పిసా యూనివర్సిటీ నుంచి కొరాడో మలాంగా ఈ పరిశోధనకు నాయకత్వం వహించారు.‘ఖాఫ్రే ప్రాజెక్ట్’( Khafra Project ) పేరుతో గిజా పీఠభూమిపై ఉన్న రెండో అతిపెద్ద పిరమిడ్ చుట్టూ వీరు పరిశోధనలు చేశారు.శాటిలైట్, రాడార్ డేటా విశ్లేషణలో సరికొత్త టెక్నాలజీని వాడటం ద్వారా తమ పరిశోధనలు పురావస్తు రంగంలో పెనుమార్పులు తీసుకురాగలవని ఈ బృందం ధీమా వ్యక్తం చేస్తోందిఈ అధ్యయనం ప్రకారం, పిరమిడ్ల కింద 2,100 అడుగుల లోతు వరకు నిలువుగా స్థూపాకారంలో ఉన్న ఎనిమిది వస్తువులను శాస్త్రవేత్తలు గుర్తించారు.

దాదాపు 4,000 అడుగుల లోతులో గుర్తించని నిర్మాణాలు కూడా ఉన్నాయని వారు చెబుతున్నారు.సింథటిక్ అపెర్చర్ రాడార్ (SAR) టెక్నాలజీని ఉపయోగించి, ఖాఫ్రే పిరమిడ్‌లోపల ఐదు చిన్న గదుల లాంటి ప్రదేశాలను కనుగొన్నామని వెల్లడించారు.

ఈ గదుల్లో ఒకదానిలో సమాధి కూడా ఉందని, దానినే ఫరో సమాధిగా భావించారని వారు చెబుతున్నారు.

Telugu Giza Pyramids, Halls Amenti, Pyramid Secrets, Radar Discovery, Secret Egy

గిజా పిరమిడ్ సముదాయంలో గ్రేట్ పిరమిడ్, ఖాఫ్రే పిరమిడ్, మెన్‌కౌరే పిరమిడ్( Great Pyramid, Pyramid of Khafre, Pyramid of Menkaure ), గ్రేట్ స్ఫింక్స్ ఉన్నాయి.వీటి కింద రహస్య గదులు, సొరంగాలు ఉండొచ్చని భావిస్తున్నారు.కొత్తగా కనుగొన్న ఈ నిర్మాణాలు ఒక పెద్ద భూగర్భ నెట్‌వర్క్‌లో భాగం కావచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే, ఈజిప్టు పురావస్తు శాఖ మాజీ మంత్రి జాహీ హవాస్ ఈ వాదనలను తీవ్రంగా ఖండించారు.ఉపయోగించిన టెక్నాలజీ “శాస్త్రీయంగా చెల్లదు” అని కొట్టిపారేశారు.ఈ పరిశోధనలు “పూర్తిగా అవాస్తవం” అని తేల్చి చెప్పారు.గ్రావిమెట్రీ, మ్యూయాన్ టోమోగ్రఫీ, రాడార్ వంటి అధునాతన టూల్స్‌తో దశాబ్దాల తరబడి పరిశోధనలు చేసినా అలాంటి భూగర్భ నగరం ఎక్కడా కనిపించలేదని ఆయన వాదిస్తున్నారు.

రాడార్ నిపుణుడు ప్రొఫెసర్ లారెన్స్ కాన్యర్స్ కూడా ఈ వాదనలను తోసిపుచ్చారు.శాస్త్రవేత్తలు ఉపయోగించిన టెక్నాలజీ వేలాది అడుగుల లోతులో ఉన్న నిర్మాణాలను గుర్తించలేదని అన్నారు.

అయితే, పురాతన నాగరికతలు పవిత్ర స్థలాలపై పిరమిడ్‌లను నిర్మించేవారని, అందువల్ల చిన్న గదులు లేదా వేడుకల ప్రదేశాలు ఉండే అవకాశం లేకపోలేదని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ పరిశోధనలపై స్వతంత్ర నిపుణులు ఇంకా సమీక్ష చేయాల్సి ఉంది.

చాలా మంది పురావస్తు శాస్త్రవేత్తలు మాత్రం ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube