దంతాలను మిలమిలా మెరిపించే తులసి ఆకులు.. ఎలా వాడాలంటే?

దాదాపు ప్రతి ఒక్కరూ తమ దంతాలు తెల్లగా మెరిసిపోతూ కనిపించాలని కోరుకుంటారు.అయితే అందరికీ అది సాధ్యం కాదు.

 How To Whiten Teeth With Basil Leaves? Basil Leaves, Basil Leaves Benefits, Late-TeluguStop.com

కొందరి దంతాలు ముత్యాల మాదిరి తెల్లగా మెరిసిపోతూ కనిపిస్తుంటాయి.కానీ కొందరి దంతాలు మాత్రం పసుపు రంగులో గార పట్టేసి కనిపిస్తుంటాయి.

ఇటువంటి దంతాలు కలిగిన వారు ఇతరులతో మాట్లాడడానికి, నలుగురిలో హాయిగా నువ్వేందుకు సంకోచిస్తుంటారు.ఈ క్రమంలోనే దంతాలను తెల్లగా మార్చుకునేందుకు టూత్ పేస్ట్ ను నెలకు ఒకటి చొప్పున మారుస్తూ ఉంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే మీకు తులసి ఆకులు అద్భుతంగా సహాయపడతాయి.దంతాలను మిలమిలా మెరిపించగల సామర్థ్యం తులసి ఆకులకు ఉంది.మరి ఇంతకీ తులసి ఆకులను ఎలా ఉపయోగించాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా కొన్ని తులసి ఆకులను ఎండలో ఎండబెట్టుకోవాలి.

పూర్తిగా ఎండిన తర్వాత ఆ తులసి ఆకులను( Basil leaves ) మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Basil, Basil Benefits, Remedy, Latest, Oral, Teeth Remedy-Telugu Health

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ తులసి ఆకుల పొడిని వేసుకోవాలి.అలాగే పావు టేబుల్ స్పూన్ సాల్ట్( salt ), చిటికెడు పసుపు( Turmeric ) మరియు మూడు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో దంతాలకు అప్లై చేసుకుని సున్నితంగా రెండు నిమిషాల పాటు తోముకోవాలి.

ఆపై వాటర్ తో శుభ్రంగా దంతాలు మరియు నోటిని క్లీన్ చేసుకోవాలి.

Telugu Basil, Basil Benefits, Remedy, Latest, Oral, Teeth Remedy-Telugu Health

ఇలా ప్రతిరోజూ కనుక చేస్తే ఎలాంటి గార పట్టిన దంతాలు అయినా సరే కొద్ది రోజుల్లోనే తెల్లగా మారతాయి.కాంతివంతంగా మెరుస్తాయి.పైగా ఈ రెమెడీని పాటిస్తే దంతాలు పుచ్చిపోవడం, చిగుళ్ల నుంచి రక్తస్రావం, చిగుళ్ల వాపు వంటి సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.

దంతాలు దృఢంగా మారతాయి.కాబట్టి పసుపు దంతాలతో బాధపడుతున్న వారు తప్పకుండా తులసి ఆకులతో పైన చెప్పిన విధంగా చేసేందుకు ప్రయత్నించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube