సాధారణంగా తొందరలో ఆహారంసేవించేటప్పుడు, నీళ్లు తాగే సమయాలలో ఎక్కిళ్లు వస్తుంటాయి.లేకపోతే ఎవరైనా తలుచుకుంటే వాళ్లకి ఎక్కిళ్లు వస్తాయని పెద్దలు అంటుంటారు.
ఒక్కొక్కసారి మనం ఏదైనా ఆహారాన్ని సేవించే సమయంలో ఎక్కిళ్ళు వస్తే చాలా ఇబ్బంది పడతాము.నిజానికి ఇదేమీ పెద్ద భయపడే సమస్య కాకపోయినా కొంత సమయం వరకు ఇబ్బందికరంగా ఉంటుంది.
కొంతమందికి పది నిమిషాల్లోనే ఎక్కిళ్లు తగ్గితే… మరి కొంతమందికి మాత్రం గంట సమయం వరకు ఇబ్బంది పెడుతుంది.ఇక ఎక్కిళ్లు తగ్గించుకోవడానికి మరికొంతమంది నీళ్లు సేవిస్తారు.
ఇలా సేవించడం వల్ల శ్వాసక్రియ రేటులో తిరిగి మార్పులు రావడంతో ఎక్కిళ్లు తగ్గిపోతాయి అని అనుకుంటారు.
ఇక మరికొందరు ఏదైనా షాకింగ్ న్యూస్ లు వింటే ఎక్కిళ్ళు ఆగిపోతాయి అని అంటూ ఉంటారు.
ఇందుకు గల కారణం ఒకటే.మెదడుకి ఆ వార్త వెళ్లి ఆ ప్రక్రియ ను కంట్రోల్ చేస్తుందని అందరూ అనుకుంటారు.
ఎక్కిళ్లు తగ్గించుకోవడానికి మరొక ఇంటి చిట్కా చూద్దామా మరి.ఇందుకోసం సొంటి ని పొడిగా చేసుకొని బెల్లంతో కలిపి సేవిస్తే త్వరగా తగ్గిపోతాయి.అలాగే సొంటి తో పాటు తేనెను కలిపి తీసుకున్న కూడా ఎక్కిళ్లు త్వరగా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి.

సాధారణంగా ఎక్కిళ్ళు పెద్ద వారి కంటే చిన్న పిల్లలకు ఎక్కువ శాతం వస్తాయి.అలా వారికీ వచ్చినప్పుడు పిల్లలను బోర్లా పడుకోబెట్టి వీపు మీద మెల్లగా కొట్టినప్పుడు అవి నెమ్మదిగా తగ్గిపోతాయి.వీటితోపాటు ఎక్కిళ్ళు తగ్గడానికి కొన్ని నీటిలో కొద్దిగా యాలకుల పొడి వేసి మరగించి ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని చల్లార్చిన తర్వాత సేవిస్తే కూడా సులువుగా అవుతుంది.