దంపుడు బియ్యం తింటే చక్కెర వ్యాధి నిజంగా కంట్రోల్ లో ఉంటుందా.. ఎలా తినాలంటే..

దంపుడు బియ్యాన్ని చాలా సంవత్సరాల క్రితం నుంచి మన పూర్వీకులు తినేవారు.ఇప్పుడంటే తెల్లటి పాలిష్ బియ్యం తినడానికే ప్రజలందరూ అలవాటు పడి ఉన్నారు.

ఎప్పుడైతే మనం తెల్లటి బియ్యం తినడం మొదలు పెట్టామో అప్పుటీ నుంచి చాలా రకాల ఆరోగ్య సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలలో రావడం మొదలైంది.దంపుడు బియ్యం రంగు తక్కువగా, ముతకగా ఉంటాయి.

అందుకే వాటిని తినేందుకు ఎక్కువగా ప్రజలు ఇష్టపడరు.కానీ అలాంటి బియ్యం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

బియ్యం పై ఉన్న పొట్టును తొలగించడానికి బియ్యానికి పాలిష్ పెడతారు.పోట్టు కింద ఉండే పొరలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

Advertisement

కానీ పాలిష్ చేసి ఆ ఆ పొట్టు కింద పొరలను తీసి పడేస్తే అందులో విటమిన్లు, ఖనిజాలు అన్ని దూరం అవుతాయి.హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు తెలిపిన దాని ప్రకారం తెల్ల బియ్యాన్ని వారంలో ఐదు సార్లు కన్నా ఎక్కువసార్లు తినేవారిలో చక్కెర వ్యాధి వచ్చే ముప్పు పెరుగుతున్నట్లు తెలిసింది.

అదే దంపుడు బియ్యం తినడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం చాలా తగ్గుతున్నట్లు ఈ పరిశోధకులు గుర్తించారు.పూర్తిగా దంపుడు బియ్యం తినలేము అనుకునేవారు కాస్త తెల్ల బియ్యం దంపుడు బియ్యం రెండిటిని కలుపుకొని వండితే చక్కెర వ్యాధి 16% తగ్గుతుందని తగ్గే అవకాశం ఉందని వీరి పరిశోధనలలో తెలిసింది.

ఈ బియ్యం లో ఉండే పిండి పదార్థాలు వేగంగా జీర్ణం కావు.నెమ్మదిగా జీర్ణమై మన శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి.కాబట్టి రక్తంలో చక్కెర స్థాయి కూడా పెరగదు.

దీనివల్ల ఆకలి కూడా త్వరగా వెయ్యదు.దంపుడు బియ్యం లో సోడియం కూడా తక్కువగా ఉంటుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

కాబట్టి రక్తపోటు సమస్య కూడా పెరిగే అవకాశం అస్సలు ఉండదు.దంపుడు బియ్యం లో నియాసిన్, విటమిన్ బి త్రీ ఎక్కువగా ఉంటాయి.

Advertisement

మెగ్నీషియం కూడా ఇందులో ఎక్కువగా ఉండడం వల్ల ఎముకల ఆరోగ్యానికి ఎంతో మంచిది.దంపుడు బియ్యం లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.

దీని వల్ల గుండెకు కూడా ఎంతో మంచిది.

తాజా వార్తలు