టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) గురించి మనందరికీ తెలిసిందే.అల్లు అర్జున్ ప్రస్తుతం సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.
సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.తొందరగా పూర్తి చేసి ఆగస్టు 15న ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు మూవీ మేకర్స్.
ఇకపోతే అల్లు అర్జున్ నటించిన బెస్ట్ సినిమాలలో ఆర్య సినిమా( Arya Movie ) కూడా ఒకటి.వన్ సైడ్ లవ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది కట్‌చేస్తే 125 రోజులు ప్రదర్శితమై, టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ చేసింది.
అయితే ఈ సినిమా విడుదల అయ్యి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అసలు ఈ కథ దర్శకుడు సుకుమార్ ఎవరి కోసం రాశారు? ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.
సుకుమార్( Sukumar ) మొదట కాకినాడలోని ఒక కాలేజీలో మాథ్స్ లెక్చరర్ గా పనిచేసేవారు.ఆ సమయంలో ఆయనకు సినిమాలపై చాలా ఆసక్తి ఉండేది.ఈ నేపథ్యంలోనే మొదట అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం అందుకున్నారు.
అలా పనిచేస్తూనే సొంతంగా ఒక కథ రాసుకున్నారు.అదే సమయంలో రాజు నిర్మాతగా, వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న దిల్ మూవీకి( Dil Movie ) డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ లో వర్క్ చేశారు.దిల్ సక్సెస్ అయితే నీకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తాను.కథ సిద్ధం చేసుకో అని రాజు మాటిచ్చారట.ఆ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు రాజుని దిల్ రాజు గా మార్చేసింది.ఆ విజయోత్సాహంలో ఉన్న ఆయన సుకుమార్ చెప్పిన కథ విన్నారు.
బాగుంది గానీ కమర్షియల్‌గా హిట్ కాదేమో అని అభిప్రాయం వ్యక్తం చేశారు.పలు చర్చల అనంతరం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.దిల్ స్పెషల్ షోకి అల్లు అర్జున్ కూడా వెళ్లారు.అతని చలాకీతనం, హాస్య చతురత చూసిన సుకుమార్ నా హీరోలాంటి క్యారెక్టరే ఇతనిది అని అనుకున్నారు.మనసులో మాట దిల్ రాజుకి( Dil Raju ) చెబితే ఆయన వెంటనే వెళ్లి అర్జున్‌తో మాట్లాడారు.గంగోత్రి తర్వాత ఎన్నో కథలు విని విసిగిపోయిన ఆయన వీళ్లు చెప్పేదీ రొటీన్ స్టోరీనే అనుకుని వద్దన్నారట.
ఎట్టకేలకు విన్నాక అదుర్స్ అన్నారు.అల్లు అరవింద్, చిరంజీవి సైతం ప్రాజెక్టుకు ఎస్ చెప్పారట.
ఈ ట్రెండీ లవ్‌స్టోరీకి నచికేత.
అని టైటిల్ పెట్టాలనుకున్నా చివరకు ఆర్య అని ఫిక్స్ చేశారు.2003 నవంబరు 19న సినిమా లాంఛనంగా ప్రారంభమైన ఆర్య ను 120 రోజుల్లో పూర్తి చేశారు.ఫీల్ మై లవ్ అంటూ ప్రతి ప్రేమికుడు ఆ ప్రేమను ఫీలయ్యాడు.అలా ఈ మూవీని రూ.4 కోట్లతో నిర్మిస్తే, ఫుల్ రన్‌లో రూ.30 కోట్లు వసూలు చేసింది.మలయాళంలో డబ్ చేసి విడుదల చేస్తే.రూ.35 లక్షల వరకూ వసూలు చేయడమే కాదు, అల్లు అర్జున్‌కు అక్కడ అభిమానగణమే ఏర్పడేలా చేసింది.ఉత్తమ దర్శకుడిగా తొలి చిత్రంతోనే సుకుమార్ ఫిల్మ్‌ఫేర్ అందుకున్నారు.అలా ఈ సినిమా అల్లు అర్జున్ కు ఎంతో స్పెషల్ గా నిలిచింది.