జనసేన పార్టీని( Janasena Party ) స్థాపించి దాదాపు పదేళ్లు అవుతున్నా. ఎప్పుడు జనసేన అధినేత, తన సోదరుడు పవన్ కళ్యాణ్ కు( Pawan Kalyan ) బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు మెగాస్టార్ చిరంజీవి.
గతంలో కాంగ్రెస్ లో కీలకంగా చిరంజీవి( Chiranjeevi ) వ్యవహరించారు.కేంద్ర మంత్రిగా , రాజ్యసభ సభ్యుడిగా పదవులు అనుభవించారు.
చాలాకాలంగా ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు .పూర్తిగా సినిమా వ్యవహారాలను పైనే దృష్టి పెడుతూ అందరివాడిగా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.తన తమ్ముడు పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో జనసేన తరఫున ఒంటరిగా పోటీ చేసిన చిరంజీవి సైలెంట్ గానే ఉన్నారు.అయితే ఇప్పుడు టిడిపి, జనసేన, బిజెపి కూాటమిగా ఏర్పడడం ,పిఠాపురం నియోజకవర్గం( Pithapuram Constituency ) నుంచి కూటమి అభ్యర్థిగా పవన్ పోటీ చేస్తూ ఉండడం తో ఇక్కడ ఎన్నికలపై అందరికీ ఆసక్తి పెరుగుతోంది.
పవన్ కళ్యాణ్ కు మద్దతుగా సినీ ప్రముఖులు చాలామంది పిఠాపురం వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం ఓ ముందడుగు వేశారు.పిఠాపురం నియోజకవర్గంలో పవన్ ను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ చిరంజీవి మాట్లాడారు.ఈ సందర్భంగా పవన్ పై ప్రశంసలు కురిపించారు .సినిమాల్లోకి కష్టంగా వచ్చిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి( Pawan Kalyan Politics ) మాత్రం ఇష్టంగా వచ్చారని చిరంజీవి అన్నారు.అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన కళ్యాణ్ ది సేవ చేసే మనస్తత్వం అని , అధికారంలో లేకపోయినా , ప్రజలకు సేవ అందించాలన్న తపన పవన్ కళ్యాణ్ ది అని చిరంజీవి అన్నారు.
తన గురించి కాకుండా, జనం గురించి పవన్ కళ్యాణ్ ను పిఠాపురం ప్రజలు ఆదరించాలని చిరంజీవి కోరారు.మత్స్యకారులను , రైతులను తన సొంత డబ్బుతో ఆదుకున్న వ్యక్తి పవన్ అని చిరంజీవి ప్రశంసరించారు.
ఏ అన్నకైనా తన తమ్ముడు మాటలు పడుతుంటే బాధ గా ఉంటుంది అని, తన తల్లి బాధను కూడా తాను చూడలేకపోతున్నాను అని, తమ్ముడికి అండగా నిలబడటం లో తప్పు లేదని భావించి మీ ముందుకు వచ్చానని చిరంజీవి అన్నారు.పవన్ జన సైనికుడుగా మారాడు అని, తన జీవితాన్ని రాజకీయాల కోసం అంకితం ఇచ్చే వ్యక్తి పవన్ అని చిరంజీవి ప్రశంసించారు .చట్టసభల్లో పవన్ కళ్యాణ్ గొంతు వినిపించాలంటే గాజు గ్లాస్ గుర్తు పై ఓటు వేసి పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని పిఠాపురం ప్రజలకు విజ్ఞప్తి చేశారు మెగాస్టార్ చిరంజీవి.