బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి అలియా భట్ ( Alia Bhatt ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె తెలుగు ప్రేక్షకులకు RRR సినిమా ద్వారా పరిచయమయ్యారు.
ఇక ఇటీవల కాలంలో వరుస సినిమాలు ఈవెంట్లతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఆలియా తాజాగా మెట్ గాలా 2024 ( Met gala 202 4 ) రెడ్ కార్పెట్ పై మెరిసారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అలియా భట్ అందరి దృష్టిని ఆకర్షించింది ఈమె ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయించిన రంగు రంగు పువ్వులతో ఉన్నటువంటి చీరను ( Saree ) ధరించారు.అయితే ఈ చీర అందరి దృష్టిని ఆకర్షించింది అయితే ఈమె ఈ కార్యక్రమంలో ఇలాంటి చీర కట్టుకోవడం వెనుక చాలా కథ ఉందని తెలుస్తోంది.ఈ కార్యక్రమంలో ఆలియా కట్టిన షిమ్మరీ శారీని ప్రముఖ డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేశాడు.
గార్డెన్ ఆఫ్ టైమ్ అనే థీమ్ కు అతికినట్లు సరిపోయేలా మన దేశ సంస్కృతికి తగ్గట్లు ఆ శారీని డిజైన్ చేశారు.
ఇక ఈ చీరను తయారు చేయడం కోసం భారీ స్థాయిలోనే కష్టపడ్డారని తెలుస్తుంది.163 మంది డిజైనర్స్ 1905 గంటల పాటు కష్టపడి తయారు చేశారని తెలుస్తుంది.ఈ చీరను ఇటలీలో తయారు చేయడం విశేషం.
ఇలా ఈమె కట్టిన ఈ చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.అయితే ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలకు అలియా భట్ ఇలా చీరలలో కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
గత కొద్దిరోజుల క్రితం జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకోవడానికి వెళ్లినటువంటి ఈమె ఏకంగా తన పెళ్లి చీర కట్టుకొని కనిపించి అందరికీ చాలా ఇన్స్పిరేషన్ గా నిలిచారు.తాజాగా మెట్ గాలా వేడుకలలో కూడా చీర కట్టులో కనిపించడంతో మన సంస్కృతి సాంప్రదాయాలకు ఎంత గౌరవం ఇస్తారో తెలుస్తోంది.