సాధారణంగా ఎన్నికల సమయంలో సినీ సెలబ్రిటీలు సైతం తమకు నచ్చిన పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంటారు.ఎన్నికల్లో ఏ పార్టీకి సపోర్ట్ చేయాలో ఆ అభ్యర్థుల ఇష్టం అనే సంగతి తెలిసిందే.
జబర్దస్త్ కమెడియన్లలో ఎక్కువమంది పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తరపున ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.పవన్ కళ్యాణ్ ను గెలిపించుకోవడం కోసం జబర్దస్త్ కమెడియన్లు పడుతున్న కష్టం అంతాఇంతా కాదు.
అయితే నగరి నియోజకవర్గంలో రోజా( Roja ) తరపున రాకింగ్ రాకేశ్( Rocking Rakesh ) ప్రచారం చేయడంతో పాటు వైసీపీకే తమ ఓటు అని కొంతమంది చెబుతున్న వీడియోను నెట్టింట షేర్ చేయడం జరిగింది.అయితే రాకింగ్ రాకేశ్ వైసీపీకి( YCP ) సపోర్ట్ చేయడంతో కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు( Pawan Kalyan Fans ) రాకేశ్ ను టార్గెట్ చేస్తూ బూతులు తిట్టడంతో పాటు నీకు ఇండస్ట్రీలో ఆఫర్లు లేకుండా చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.
అయితే పవన్ ఫ్యాన్స్ వార్నింగ్ కు భయపడిన రాకేష్ ఆ వీడియోను డిలీట్ చేయడం జరిగింది.అయితే నెటిజన్లు మాత్రం పవన్ ఫ్యాన్స్ తీరుపై ఒకింత ఫైర్ అవుతున్నారు.పవన్ తరపున ప్రచారం చేసే వాళ్ల విషయంలో వైసీపీ ఇలా వ్యవహరించిందా? ఇలా వార్నింగ్స్ ఇచ్చిందా? అంటూ ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
పవన్ ఫ్యాన్స్ ఓపికగా వ్యవహరిస్తే మంచిదని పవన్ గురించి నెగిటివ్ గా ప్రచారం చేయనప్పుడు చిన్న ఆర్టిస్టులను టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కామెంట్లు చేస్తున్నారు.ఇలాంటి ఫ్యాన్స్ తీరును ఖండించాల్సిన బాధ్యత పవన్ పై కూడా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.రాకింగ్ రాకేశ్ మెతక అని ఆయనను ఇంతలా టార్గెట్ చేశారని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
రాకేశ్ నెగిటివ్ కామెంట్లను పట్టించుకోకుండా ముందుకు సాగాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.