భారతీయ సినీ పరిశ్రమలో అరుదైన రికార్డు సాధించిన రవితేజ మూవీ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో నటుడు రవితేజ( Raviteja ) ఒకరు.ఈయన హీరోగా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

 Tiger Nageswara Rao Is The First Indian Film To Have An Ott Release In Sign Lang-TeluguStop.com

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్టుగా మంచి సక్సెస్ అయినటువంటి రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్లో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇటీవల టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కినటువంటి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేక పోయిందని చెప్పాలి.ఇలా రవితేజ కెరియర్ లో ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.అయితే తాజాగా ఈ సినిమా అరుదైన ఘనత సాధించింది.ఇప్పటివరకు భారతీయ సినీ పరిశ్రమలో ఏ హీరో సినిమా సాధించని ఘనత రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా సాధించిందని చెప్పాలి.

తాజాగా ఈ సినిమా సైన్ ల్వాంగేజ్‌( Sign Language ) ఓటీటీలో అందుబాటులోకి తీసుకువ‌చ్చారు.ఇప్పటివరకు ఏ భారతీయ సినిమా కూడా సైన్ లాంగ్వేజ్ ఓటీటీలో విడుదల కాలేదు.ఇలా ఈ ఓటీటీలో విడుదల కాబోతున్న మొట్టమొదటి చిత్రంగా టైగర్ నాగేశ్వరరావు రికార్డ్ సాధించింది.

ఈ చిత్రంలోని పాటలు, సౌండ్ లాంటివి వినలేకపోవచ్చు కానీ.కథేంటి? డైలాగ్స్ ఏంటి అనేవి దివ్యాంగులకు కూడా తెలుస్తాయి.ఇలాంటి వారి కోసమే ఈ సైన్ లాంగ్వేజ్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు అయితే ఇప్పటివరకు ఎవరూ కూడా ఈ లాంగ్వేజ్ పై పెద్దగా దృష్టి సారించలేదని చెప్పాలి.ఇలా రవితేజ సినిమా ఈ ఘనత సాధించడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube