కొద్దిరోజుల క్రితం వైసీపీ అధినేత జగన్( YS Jagan Mohan Reddy ) ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ఢిల్లీలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాయి .ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అనేక హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని, వైసీపీ నేతలనే టార్గెట్ చేసుకుంటూ అనేక దాడులు , హత్యలు జరిగాయని వీటిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాను నిర్వహించారు .
ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ పార్టీలను తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా, ధర్నా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానం అందించారు.
![Telugu Ap Tdp, Congress, Telangana, Ysrcp, Ysrcpdelhi-Politics Telugu Ap Tdp, Congress, Telangana, Ysrcp, Ysrcpdelhi-Politics](https://telugustop.com/wp-content/uploads/2024/07/BJP-Telangana-elections-Telangana-government-ysrcp-TDP-ap-TDP-ap-cm-chandrababu-YSRCP-delhi.jpg)
కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి చెందిన సమాజ్ వాది పార్టీ , శివసేన వర్గం అన్నా డిఎంకె, విడుదలై చిరుతై కట్చి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తదితర పార్టీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు అయితే ఈ ధర్నా కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ( BRS party ) దూరంగా ఉండడం చర్చనీయాంసంగా మారింది.కేసీఆర్, జగన్ ఎప్పటి నుంచో స్నేహపూర్వకంగా మెలుగుతున్నారు.అనేక సందర్భాల్లో ఒక పార్టీకి మరో పార్టీ మద్దతుగా నిలిచాయి.
అయితే ప్రస్తుతం కెసిఆర్ జగన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయా అనే అనుమానం అందరిలో కలుగుతోంది.దీనికి కారణం ఢిల్లీలో నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి బీఆర్ఎస్ హాజరు కాకపోవడమే ఆసక్తికరంగా మారింది .
![Telugu Ap Tdp, Congress, Telangana, Ysrcp, Ysrcpdelhi-Politics Telugu Ap Tdp, Congress, Telangana, Ysrcp, Ysrcpdelhi-Politics](https://telugustop.com/wp-content/uploads/2024/07/Telangana-elections-Telangana-government-ysrcp-TDP-ap-TDP-ap-cm-chandrababu-delhi-Deeksha-bjp.jpg)
అసలు వైసిపి బీఆర్ఎస్ ను ఆహ్వానించిందా లేదా ? ఆహ్వానించినా బీఆర్ఎస్ ఎంపీలు ఉద్దేశపూర్వకగానే గైర్హాజరయ్యారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.బీఆర్ఎస్ కు చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు ఆ సమయంలో ఢిల్లీలోనే ఉన్నప్పటికీ , వారు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ అవసరం లేదని జగన్ భావించారా అనేది ప్రస్తుతం చర్చకు కారణం అవుతుంది.అయితే వైసిపి ధర్నా కార్యక్రమానికి ఇండియా కూటమి లోని పార్టీలు మద్దతు తెలిపిన నేపథ్యంలో, తాము వైసీపీ దీక్షకు మద్దతు తెలిపితే ఇండియా కూటమికి బీఆర్ఎస్ దగ్గరవుతుందనే సంకేతాలు జనాల్లోకి వెళ్తాయని , అది బీఆర్ఎస్ కు రాజకీయంగా నష్టం చేకూరుస్తుందనే ఉద్దేశంతోనే ఆ పార్టీ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండవచ్చనే చర్చ సైతం.
జరుగుతోంది.