సాధారణంగా కొందరు చిన్న చిన్న విషయాలు కూడా ఒత్తిడికి గురవుతుంటారు.తరచూ ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే విషయాలను తప్పకుండా తెలుసుకోండి.మనిషి శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం.అయితే మనం తినే ఆహారాలు, చేసే పనులు మన మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.

ప్రస్తుత రోజుల్లో చాలా మంది నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు.కంటినిండా నిద్ర లేకపోవడం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది.ఒత్తిడి, డిప్రెషన్( Stress, Depression ), బైపోలార్ డిజార్డర్ తదితర సమస్యలు తలెత్తుతాయి.అందుకే కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోవాలి.అలాగే శరీరంలో నీటి శాతం సరిగా లేకపోతే క్షణక్షణం మూడ్ మారిపోతూ ఉంటుంది.విసుకు, చిరాకు మన చుట్టూనే తిరుగుతాయి.
అందువల్ల బాడీని ఎప్పుడూ హైడ్రేట్ గా ఉంచుకోవాలి.అందుకు సరిపడా నీటిని తీసుకోవాలి.
బిజీ లైఫ్ స్టైల్ కారణంగా కొందరు ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తూ ఉంటారు.ఇది కూడా మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
మెదడు సరిగ్గా పని చేయాలంటే తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి.కొవ్వులు తక్కువగా, మాంసకృతులు ఎక్కువగా మరియు పిండి పదార్థాలు మధ్యస్థంగా ఉండే ఆహారాలు అల్పాహారంగా తీసుకోవాలి.</b

అలాగే ఫాస్ట్ ఫుడ్స్( Fast food ) ను అధికంగా తినేవారిలో యాంగ్జయిటీ లెవెల్స్ అధికంగా ఉంటాయి.తరచూ ఒత్తిడికి లోనవుతారు.కాబట్టి ఫాస్ట్ ఫుడ్స్ ను పక్కన పడేసి పోషకాహారం తీసుకోవడం అలవాటు చేసుకోండి.తాజా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, నట్స్, సీడ్స్, మొలకెత్తిన విత్తనాలు తదితర ఆహారాలను తీసుకోండి.
ఇవి శారీరక ఆరోగ్యం తో పాటు మానసిక ఆరోగ్యాన్ని సైతం మెరుగుపరుస్తాయి.ఒత్తిడి డిప్రెషన్ వంటి మానసిక సమస్యలకు దూరంగా ఉండాలి అనుకుంటే ప్రతినిత్యం వ్యాయామం ( Exercise )చేయండి.
వ్యాయామం మైండ్ ను రిఫ్రెష్ చేస్తుంది.ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.
ఇక చక్కెరకు ఎంత దూరంగా ఉంటే మానసిక ఆరోగ్యం అంత బాగుంటుంది.ఎందుకంటే చక్కెర మెదడును మొద్దుబారేలా చేస్తుంది.
ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తుంది.మానసిక కల్లోలానికి కారణం అవుతుంది.
కాబట్టి చక్కెర తీసుకోవడం మానుకోండి.








