ఒంట్లో కొవ్వును ఐసు ముక్కలా కరిగించే బెస్ట్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ మీ కోసం!

ఒంట్లో కొవ్వు పేరుకుపోయే కొద్ది రోగాలకు దరిచేరుతూ ఉంటారు.ఊబకాయం, మధుమేహం, గుండెపోటు, ర‌క్త‌పోటు, క్యాన్సర్.

 Best Drink For Burning Fat Is For You Details, Fat Cutter Drink, Latest News, H-TeluguStop.com

ఇలా ఎన్నో ఎన్నెన్నో జబ్బులు వచ్చే రిస్క్ పెరుగుతుంది.అయితే ఒంట్లో కొవ్వు( Body Fat ) పేరుకు పోవడానికి కారణాలు చాలానే ఉంటాయి.

అలాగే ఆ కొవ్వును కరిగించుకోవడానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఫ్యాట్ కట్ట‌ర్‌ డ్రింక్( Fat Cutter Drink ) మీ ఒంట్లో కొవ్వును ఐసు ముక్కలా కరిగించేస్తుంది.

రెగ్యులర్ గా ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందుతారు.

-Telugu Health

ఫ్యాట్ కట్టర్ డ్రింక్ తయారీ కోసం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక ఐదు నుంచి ఆరు ఫ్రెష్ పుదీనా ఆకులు,( Mint Leaves ) ఐదు దంచిన మిరియాలు, ( Crushed Black Pepper ) పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు, చిన్న జాజికాయ ముక్క వేసుకుని మరిగించాలి.

దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగిస్తే మన డ్రింక్ రెడీ అవుతుంది.స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.

-Telugu Health

రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు అరగంట ముందు ఈ డ్రింక్ కనుక తీసుకుంటే ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు మొత్తం క్రమంగా కరిగిపోతుంది.లావుగా ఉన్న మీరు నాజుగ్గా మారతారు.బాన పొట్ట ఫ్లాట్ అవుతుంది.అలాగే ఈ డ్రింక్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.జలుబు, దగ్గు వంటి సమస్యల‌ నుంచి వేగంగా బయటపడతారు.

శరీరంలో పేరుకుపోయిన మలినాలు తొలగిపోతాయి.

బాడీ డిటాక్స్ అవుతుంది.అలాగే తలనొప్పి, ఒత్తిడి నివారణకు ఈ డ్రింక్ న్యాచురల్ మెడిసిన్ లా పనిచేస్తుంది.

ఆయా సమస్యల నుంచి క్షణాల్లో రిలీఫ్ ను అందిస్తుంది.అంతేకాకుండా ఈ డ్రింక్ ను నిత్యం తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు సైతం అదుపులో ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube