కన్నబిడ్డలను దత్తతకు ఇచ్చిన యూఎస్ మహిళ.. కారణం తెలిస్తే షాకే..

సాధారణంగా తల్లులు తమ కన్న పేగు బంధాన్ని తెంచుకోవడానికి అస్సలు ఇష్టపడరు.కష్టమైనా పిల్లలను పెంచి పోషిస్తారు.

 Us Single Mother Gives Up Children For Adoption Says She Cant Afford To Raise Th-TeluguStop.com

తమ సౌకర్యాలను త్యాగం చేసి వారిని ఒక స్థాయికి తీసుకొస్తారు కానీ ఒక అమెరికా మహిళ మాత్రం తన ఇద్దరు కన్న బిడ్డలను ఒక సిల్లీ రీజన్‌తో దత్తతకు( Adoption ) ఇచ్చేసింది.పెన్సిల్వేనియాకి చెందిన ఈ తల్లి పేరు హన్నా మార్టిన్.

( Hannah Martin ) వయసు 32 ఏళ్లు.ఆమె తన ఇద్దరు పిల్లలను దత్తతకు ఇచ్చిన కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

తన ఆర్థిక పరిస్థితి( Financial Hardship ) బాగా లేకపోవడంతో ఈ కష్ట నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆమె చెప్పింది.కానీ చాలామంది చేతిలో చిల్లి గవ్వ లేని తల్లులు కూడా అతని పిల్లల్ని పెంచుకుంటున్నారు అని అంటున్నారు.

మరికొంతమంది ఆమె నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.

Telugu Adriana, Afd, Hannah Martin, Mothers Love, Pennsylvania, Parenthood, Tyle

హన్నాకు మొత్తం ఐదుగురు పిల్లలు.ఆమెకు 19 ఏళ్ల వయసులోనే మొదటి పాప అయిన అడ్రియానా జన్మించింది.కానీ అడ్రియానాకు కేవలం ఒక నెలన్నర వయసు ఉండగానే ఆమె బాయ్‌ఫ్రెండ్ బిడ్డకు తాను తండ్రి కాదని తిరస్కరించాడు.

ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న హన్నా, 2011లో అడ్రియానాను( Adriana ) దత్తతకు ఇచ్చే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.ఒక లాయర్ సహాయంతో ఆమె అడ్రియానాను దత్తత తీసుకునేందుకు ఒక కపుల్‌ను కనుగొంది.

Telugu Adriana, Afd, Hannah Martin, Mothers Love, Pennsylvania, Parenthood, Tyle

2011లో తన మొదటి పాప అడ్రియానాను దత్తతకు ఇచ్చిన హన్నా మార్టిన్, రెండేళ్ల తర్వాత 2013లో టైలర్‌( Tyler ) అనే కుమారునికి జన్మనిచ్చింది.అయితే, టైలర్‌ను కూడా పెంచడానికి తనకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో, మరో కుటుంబానికి దత్తతకు ఇవ్వడానికి నిర్ణయించుకుంది.“ఒక పిల్లని దత్తతకు ఇవ్వడం చాలా బాధాకరం.ఇది ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో మనసులను కలచివేసే సంఘటన.

కానీ, మనం సరైన నిర్ణయం తీసుకుంటున్నామనే అనుభూతి కూడా కలుగుతుంది,” అని హన్నా తన అనుభవాన్ని పంచుకుంది.

ప్రస్తుతం హన్నా మార్టిన్ తన మిగతా ఇద్దరు కొడుకులు, ఒక కూతురును ఒంటరిగా పెంచుతోంది.

తన దత్తతకు ఇచ్చిన పిల్లలను చూడాలని ఆమె ఎంతో కోరుకుంటున్నప్పటికీ, వారి ఫోటోలు కూడా ఆమె వద్ద లేవు.ఈ పరిస్థితి ఆమెకు ఎంతో బాధ కలిగించినప్పటికీ, తన పిల్లల మంచి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె నమ్ముతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube