బిర్యానీ లవర్స్.. కొత్త పార్లే-జి బిస్కెట్ల బిర్యానీ వచ్చేసింది.. ట్రై చేసారా?

బిర్యాని.( Biryani ) రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు మాత్రమే కాకుండా భారతదేశంలో చాలామందికి ఆదోరకమైన ఇష్టం అంతే.

 Woman Makes Biryani With Parle-g Biscuits Viral Video Details, Social Media, Vir-TeluguStop.com

చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇంకా అనేక రకాల వెజ్, నాన్ వెజ్ బిర్యానీలు మనకు అందుబాటులో ఉన్నాయి.ఇక హైదరాబాద్ మహానగరంలో తయారుచేసిన దమ్ బిర్యాని ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

దేశంలోని మర్మూల ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన సమయంలో, అలాగే విదేశీయులు ఎవరైనా భారతదేశ పర్యటనకు వచ్చిన హైదరాబాద్ బిర్యాని( Hyderabad Biryani ) రుచి చూడకుండా ఉండరు.అలా మన హైదరాబాద్ బిర్యాని ప్రపంచంలోనే ఫేమస్.

ఇది ఇలా ఉంటే.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ కొత్త రకం బిర్యానీ ఫేమస్ అవుతుంది.అదేందో తెలుస్తే.మీరు నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే.మీకు ఊహలుకు అందని విధంగా ఓ మహిళ పార్లేజీ బిస్కెట్లతో బిర్యాని( Parle-G Biscuits Biryani ) చేసేసి వడ్డిచేస్తుంది.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే నిజంగా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.ఓ మహిళ ఓ బిర్యాని పాత్ర ముందు నిల్చని ఉండగా.

అందులో బిర్యానితో పాటు పార్లేజీ బిస్కెట్ కూడా ఆమె వడ్డిస్తున్నట్లు కనపడుతోంది.

అలాగే ఈ బిర్యానీని మంచి మసాలాలతో తయారు చేశానని తన వెనుక కనిపించే పిల్లలు తన విద్యార్థులని, బిర్యాని తినాలని వారు కోరుకున్నందుకే తాను ఈ స్పెషల్ బిర్యానీ తయారు చేసినట్లుగా ఆమె తెలిపింది.ఇక వీడియోలో కనిపిస్తున్న మహిళ హీన కౌసర్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ దూసుకెళ్తోంది.

ఈ వీడియో చూసిన చాలామంది బిర్యాని లవర్స్ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.కొందరైతే.

మీలాంటి వల్లే కరోనా లాంటి మహమ్మారి మరోసారి రాబోతోందేమో అని భయమేస్తుందని కామెంట్ చేస్తుండగా.మరికొందరైతే, ఈమెపై ఖచ్చితంగా కేసు పెట్టాలి లేకపోతే ఫేమస్ అయిన బిర్యానితో ఇలా జోక్ చేయడం ఏంటి అని కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube