రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వెంకటేష్, మీనా ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా చంటి.ఈ సినిమాకు కె.
ఎస్.రామారావు నిర్మతగా వ్యవహరించారు.ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమాలో వెంకటేష్ మాయకత్వంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.వెంకటేష్, మీనాల కెరీర్ ఈ సినిమా ఓ మైలు రాయి గా నిలిచింది.
తమిళం లో వచ్చిన చిన్న తంబీ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా ను రూపొందించారు.
ఈ సినిమా కి రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు.ఈ సినిమాని తెలుగు నేటివిటీ కి తగ్గట్లుగా రూపొందించారు.
హిందీ సినిమా లో వెంకీ మామ తో పాటు కరిష్మా కపూర్ ప్రధాన పాత్ర పోషించారు.తెలుగు లో మీనా, వెంకటేష్ లతో పాటు నాజర్, బ్రహ్మానందం కూడా కీలక పాత్రలను పోషించి ఆకట్టుకున్నారు.
ఆరోజుల్లోనే నలభై థియేటర్లలో వందరోజులు ఆడిన సినిమా గా “చంటి ” రికార్డులు సృష్టించింది.
ఈ సినిమాలో వెంకటేష్ చిన్న తనంలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా.? అతని పేరు అజయ్ రాఘవేంద్ర.

“చంటి” సినిమాలో నటించిన తరువాత, అజయ్ రాఘవేంద్ర హీరో గా రాణించాలనుకున్నాడు.ఇక “బాపు బొమ్మకు పెళ్ళంటా” అనే సినిమాలో హీరో గా నటించాడు.కానీ, ఆ తరువాత అవకాశాలు అంతగా రాకపోవడం తో సినిమాలకు దూరం గా ఉన్నాడు.
అలాగే.చిన్నప్పటి మీనా గా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు మౌనిక.

ఆమె కూడా పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి పెళ్లి తరువాత ప్రస్తుతం సినిమాలకు దూరం గా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.ఇక అదే సినిమాలో మీనా చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన మౌనిక కూడా అల్లరి నరేష్ హీరోగా మా అల్లుడు వెరీ గుడ్ సినిమాలో నటించింది ఆ తర్వాత శివరామరాజు సినిమా లో జగపతిబాబు, వెంకట్, శివాజీ లా చెల్లెలిగా నటించి మంచి గుర్తింపు సాధించింది
.