తెలుగు బాషా పైన అభిమానం ఉన్నవాళ్లు ఎవరైనా ఈ పాట ఖచ్చితంగా వినాలి.పాట బాగుందనో, లేక బాగా తీసారనో కాదు.
దానికి ముఖ్యమైన రెండు కారణాలు ఉన్నాయ్.అంతకన్నా ముందు ఆ పాట గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. 1975 లో బాపు దర్శకత్వంలో వచ్చిన సినిమా ముత్యాల ముగ్గు.ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక మెయిలు రాయి లాంటిది.
ఈ సినిమా లో రామాయణం కథ కనిపిస్తూ ఉంటుంది.ఈ సినిమాలో రావు గోపాలరావు నటన ఒక అద్భుతం.
ఇక శ్రీధర్ రావు మరియు సంగీత హీరో హీరోయిన్స్ గా నటించారు.ఈ సినిమా అప్పట్లో ఒక పెద్ద సంచలనం.
ముత్యాల ముగ్గు సినిమాకు దర్శకత్వం వహించింది కే వి మహదేవన్.
సినిమాలోని ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం.
ఈ చిత్రానికి గాను ముగ్గురు పాటలు రాయగా అందులో శేషేంద్ర శర్మ గారు రాసిన ఏకైక తెలుగు పాట నిదురించే తోటలోకి.శేషేంద్ర శర్మ ఇందులో పాట రాయించడానికి గల కారణం ఆ సినిమా షూటింగ్ కోసం రాణి ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్ తన కోటను ఫ్రీ గా ఇచ్చారట.
అందుకు గాను శేషేంద్ర శర్మ గారికే ఒక పాట రాయించాలని ఆమె కోరారట.అందువల్లే అయన ఈ సినిమా కోసం పాట రాసారు.అయన కు మాత్రమే తెలిసిన కొన్ని విషయాలు చాల మంది ప్రస్తుతం పాటలు రాస్తున్న వారికి తెలియకపోవడం బాధాకరం .
శేషేంద్ర శర్మ గారు రాసిన నిదురించే తోటలోకి పాటలో రెండవ పల్లవి లో విఫలమైన నా కోర్కెలు.వేలాడే గుమ్మంలో అనే లైన్ ఉంటుంది, అయితే ప్రస్తుతం అందరు విఫలం లో ‘ఫ’ ని Fa గా పలుకుతారు కానీ అది ఫలం(Falam), ఫణి(Fani).వాస్తవానికి తెలుగులో ‘Fa’ అనే శబ్దం లేదు అనేది కొందరి భాషావేత్తలు వాదన.‘ఫ’ అనే శబ్దాన్ని Pha అంటూ ఉచ్చరించాలి.‘భ’ అనే శబ్దాన్ని Bha అంటూ ఉచ్చరించాలి.ఇక అరబిక్ నుంచి వచ్చి స్థిరపడింది ‘Fa’.ఇక ఈ పాటను ఆలపించిన సుశీల సైతం ‘విఫలమైన’ అనే పదం వచ్చినపుడు Fa అనకుండా, Pha ఎంతో క్లియర్ గా ఉచ్చరించారు.ఆలా అయన భాషకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు.