శరీరంపై ఉన్న అవాంఛిత రోమాలను తొలగించుకొనేందుకు దాదాపు అందరు అమ్మాయిలు వ్యాక్సింగ్‌ను ఎంచుకుంటారు.కనీసం నెలకు ఒక సారి అయినా వ్యాక్సింగ్ చేయించుకునే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు.
అయితే కొందరు ఇంట్లోనే వ్యాక్సింగ్ చేసుకుంటే.మరికొందరు పార్లర్స్‌లో వ్యాక్సింగ్ చేయించుకుంటారు.
ఇక వ్యాక్సింగ్ చేయించుకోవడం వల్ల స్కిన్ క్లీన్ అండ్ గ్లోయింగ్‌గా కనిపిస్తుంది.అయితే చాలా మంది వ్యాక్సింగ్ తర్వాత స్కిన్‌పై రాషెస్, దురద, మంట, దద్దురులు వస్తాయి.
ఈ క్రమంలోనే వాటిని తగ్గించుకునేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే న్యాచురల్‌గా కూడా ఆ సమస్యలను దూరం చేసుకోవచ్చు.మరి ఆ న్యాచురల్ టిప్స్ ఏంటీ అన్నది లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.వ్యాక్సింగ్ తర్వాత… రాషెస్, మంట, దద్దురులు ఇలా ఏ సమస్యకైనా అలోవెరా అద్భుతంగా సహాయపడుతుంది.
వ్యాక్సింగ్ చేయించుకున్న తర్వాత న్యాచురల్ అలోవెరా జెల్‌ను స్కిన్ అప్లై చేస్తే.మంచి ఫలితం ఉంటుంది.

అలాగే ఒక బౌల్‌లో కొబ్బరి నూనె, టీ ట్రీ ఆయిల్ మరియు నిమ్మరసం మూడు కలిపి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని వ్యాక్సిన్ తర్వాత స్కిన్‌కు అప్లై చేస్తే.రాషెస్, దురద వంటి సమస్యలు సులువుగా దూరం అవుతాయి.ఇక వ్యాక్సింగ్ తర్వాత చాలా మంది చేసే పొరపాటు.మంటగా, దురదగా ఉందని సబ్బుతో వాష్ చేసుకుంటారు.కానీ, ఇలా చేయడం స్కిన్‌కు ఏ మాత్రం మంచిది కాదు.
అలాంటి సమయంలో కనీసం కొబ్బరి నూనెను అయినా స్కిన్‌కు అప్లై చేసుకోవడం మంచిది.అలాగే వ్యాక్సింగ్‌కు వెళ్లే ముందు ఎట్టిపరిస్థితుల్లోనూ మోయిస్తూరిజ్ క్రీమ్స్ లేదా పౌడర్స్ వంటి అప్లై చేయకూడదు.
ఇవి ఉపయోగించడం వల్ల.వ్యాక్సింగ్ చేసే సమయంతో తీవ్ర నొప్పికి దారి తీస్తుంది.
ఇక వ్యాక్సిన్ తర్వాత మంట, రాసెష్ సమస్య ఉంటే..
ఐస్ క్యూబ్స్‌ను డైరెక్ట్‌గా రుద్దుకోవాలి.ఇలా చేయడం మంచి ఉపశమనం లభిస్తుంది.