ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటులుగా గుర్తింపు తెచ్చుకున్న హీరోలు చాలా మంది ఉన్నారు.ప్రస్తుతం స్టార్ హీరోలు అందరూ మంచి విజయాలను అందుకుంటున్న నేపధ్యంలో విజయ్ దేవరకొండ (Vijay Deverakond)లాంటి నటుడు సైతం మంచి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు.
ప్రస్తుతం ఆయన ‘కల్కి 2’ (Kalki 2)సినిమాలో కూడా కీలకపాత్రలో నటించబోతున్నాడనే విషయం అయితే తెలిసిందే.అయితే కల్కి మొదటి పార్ట్ లో అర్జునుడి పాత్రను పోషించిన ఆయన కల్కి 2 సినిమాలో కూడా మరోసారి కనిపించి ఒక భాగం కానున్నాడట.
ఇంక దాంతోపాటుగా ‘ పుష్ప 3’ (‘Pushpa 3’)సినిమాలో కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించబోతున్నాడనే విషయం అయితే తెలూస్తోంది.

ఇప్పటికే ఆయన కింగ్ డమ్ (Kingdom)అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించే ప్రయత్నమైతే చేస్తున్నాడు.మరి ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంటాడు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.
స్టార్ హీరోల సినిమాలో కీలకపాత్రలో నటించి మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.దీని ద్వారా ఆయన మార్కెట్ పెరగడమే కాకుండా స్టార్ హీరోలకు కూడా దగ్గర అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.

ఇక స్టార్ హీరోలా కనుసన్నల్లో ఉంటే వాళ్లకు మంచి అవకాశాలు రావడమే కాకుండా స్టార్ హీరోగా ఎదిగే అవకాశాలు కూడా వస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ బాగా ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది.అందుకే ఇటు ప్రభాస్, అటు అల్లు అర్జున్(Prabhas , Allu Arjun) ఇద్దరితో మంచిర్యాపో మెయింటైన్ చేస్తున్న ఈయన ఇక మీదట స్టార్ హీరోగా ఎదిగి తన సత్తా ఏంటో చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు…
.