బెట్టింగ్ యాప్స్( Betting Apps ) ప్రమోట్ చేస్తున్నటువంటి వారిపై పోలీసుల పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.ముందుగా యూట్యూబర్స్ పై కేసులో నమోదు చేసి వారిని జైలుకు పంపించారు.
అనంతరం ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ లో ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది సెలెబ్రిటీలు కూడా ఉన్నారని తెలుస్తుంది.ఇలా సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వీడియోలు బయటకు రావడంతో వారందరిపై కూడా పోలీసుల కేసు నమోదు చేసి విచారణకు పిలుస్తున్నారు.
ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు సెలబ్రిటీలపై ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నటువంటి వారిపై కేసులు నమోదు చేయడంతో ప్రతిరోజు ముగ్గురు చొప్పున విచారణకు హాజరవుతున్నారు.
ఇప్పటికే టేస్టీ తేజ కానిస్టేబుల్ కిరణ్ గౌడ్, రీతు వర్మ, విష్ణు ప్రియ వంటి వారందరూ కూడా విచారణకు వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే.ఇకపోతే నేడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి యాంకర్ శ్యామల ( Anchor Shyamala ) హాజరయ్యారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లలో భాగంగా ఈమెపై కూడా కేసు నమోదు అయిన విషయం తెలిసిందే .ఈ క్రమంలోనే నేడు విచారణకు హాజరయ్యారు.

ఇక ఈమెపై పోలీస్ కేసు నమోదు కావడంతో తెలంగాణ కోర్టును ఆశ్రయించారు.దీంతో ఈమెను అరెస్టు చేయకూడదని పోలీసులు విచారణ జరపాలి అంటూ ఆదేశాలు ఇవ్వడంతో కాస్త ఉపశమనం కలిగింది.ఇక నేడు విచారణకు వెళ్లిన అనంతరం శ్యామల మీడియా సమావేశంలో మాట్లాడారు.
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ అంశం గురించి విచారణ జరుగుతుందని అయితే ప్రస్తుతం ఈ విషయం కోర్టులో ఉన్న నేపథ్యంలో తాను ఏం మాట్లాడదలచుకోలేదని తెలిపారు.

ఇక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం అన్నది పూర్తిగా తప్పని ఈమె తెలిపారు.ఇకపై ఇలాంటి తప్పు జరగదని, నష్టపోయిన వారు ఎవరైనా ఉంటే ఆ లోటు తీర్చలేనిది అని అన్నారు.ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయమని చెప్పారు.
ఇక ఈ విషయంలో తాను పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని, చట్టంపై తనకు పూర్తి నమ్మకాలు గౌరవం ఉందని శ్యామల తెలిపారు.