కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు అసహ్యంగా కనిపిస్తున్నాయా.. వారం రోజుల్లో వాటిని తరిమికొట్టండిలా!

డార్క్ సర్కిల్స్ లేదా నల్లటి వలయాలు( Under Eye Dark Circles ). మనలో చాలా మంది ఫేస్ చేసే కామన్ సమస్యల్లో ఇది ఒకటి.

 Super Effective Remedy To Get Rid Of Dark Circles Within One Week!, Home Remedy,-TeluguStop.com

ఒత్తిడి, మొబైల్ ఫోన్ ను అధికంగా చూడడం, నిద్రను నిర్లక్ష్యం చేయడం, ఆహారపు అలవాట్లు, పలు రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి.ఇవి అందాన్ని పాడు చేస్తాయి.

అసహ్యంగా కనిపిస్తుంటాయి.అయితే ఈ నల్లటి వలయాలను ఎలా వదిలించుకోవాలో తెలియక మేకప్ తో కవర్ చేస్తుంటారు.

కానీ ఆ అవసరం అక్కర్లేదు.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే వారం రోజుల్లో ఈజీగా నల్లటి వలయాలను తరిమి తరిమి కొట్టవచ్చు.

Telugu Tips, Dark Circles, Darkcircles, Remedy, Latest, Skin Care, Skin Care Tip

మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్( Sweet Almond Oil ), నాలుగు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.చివరిగా రెండు టేబుల్ స్పూన్లు స్వచ్ఛమైన తేనె వేసి మరోసారి అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు కళ్ళకు ఏమైనా మేకప్ ఉంటే పూర్తిగా తొలగించి ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఆ తర్వాత తయారు చేసుకున్న మిశ్రమాన్ని కళ్ళ చుట్టూ అప్లై చేసుకొని కనీసం ఐదు నిమిషాల పాటు సున్నితంగా సర్కులర్ మోషన్ మసాజ్ చేసుకోవాలి.

Telugu Tips, Dark Circles, Darkcircles, Remedy, Latest, Skin Care, Skin Care Tip

అరగంట అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒకసారి గనుక చేస్తే చాలా తక్కువ సమయంలోనే కళ్ళ‌ చుట్టూ ఏర్పడ్డ నల్లటి వలయాలు( Dark Circles ) మాయం అవుతాయి.కళ్ళు అందంగా, ఆకర్షణీయంగా మారుతాయి.

కాబట్టి ఎవరైతే నల్లటి వలయాలు ఉన్నాయని బాధపడుతున్నారో వారు తప్పకుండా ఈ సింపుల్ రెమెడీని పాటించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube