హైదరాబాద్ బేగంపేటలోని ఐటీసీ కాకతీయలో ఫ్యూచర్ ఫార్వర్డ్ తెలంగాణలో భాగంగా ఉమెన్ ఆస్క్ కేటీఆర్ కార్యక్రమం జరిగింది.ఈ సదస్సుకు హాజరైన మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉమ్మడి కుటుంబాల్లో మహిళలది ప్రధాన పాత్ర అని మంత్రి కేటీఆర్ తెలిపారు.తన చిన్నతనం అంతా ఉమ్మడి కుటుంబంలో గడిచిందన్న ఆయన తన జీవితంలో ఎంతోమంది స్ట్రాంగ్ మహిళా నాయకురాళ్లను చూసినట్లు చెప్పారు.
ఈ క్రమంలోనే మహిళల అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిందన్నారు.వడ్డీలేని రుణాలు అందించడంతో పాటు మహిళల కోసం నాలుగు ఇండస్ట్రీయల్ పార్కులు ఏర్పాటు చేశామని తెలిపారు.
మ్యానిఫెస్టోలో లేకపోయినా కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, అమ్మఒడి, కేసీఆర్ కిట్ వంటి అనేక పథకాలను మహిళల కోసం ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు.







