ప్రస్తుతం మారుతున్న కాలంలో చాలామంది కొబ్బరి నూనెను ఉపయోగించడాన్ని చాలా వరకు తగ్గించారు.కొబ్బరి నూనెలో మనకు ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి.
మన శరీరాన్ని జుట్టును మాత్రమే కాకుండా కొబ్బరినూనె నొప్పులను తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారు.చర్మం పొడిబారకుండా కాపాడేందుకు కూడా ఉపయోగిస్తారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
కొబ్బరి నూనె ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఖచ్చితంగా ప్రతిరోజు ఉపయోగిస్తారు.
కొబ్బరి నూనె ఒకప్పుడు నిత్యం జుట్టుకు పెట్టుకోవడానికి,ఒంటికి రాసుకోవడానికి పెద్దవారు ఎక్కువగా ఉపయోగించేవారు.
కానీ ప్రస్తుత రోజుల్లో చాలామంది కొబ్బరి నూనెకు బదులుగా శరీరానికి క్రీములు, హెయిర్ ఆయిల్స్ లాంటివి ఉపయోగిస్తున్నారు.అయితే ప్రతిరోజు మనం ఉపయోగించే క్రీములు, హెయిర్ జెల్స్ శరీరానికి ఏమాత్రం ఉపయోగపడవు.
దీని ఉపయోగం అప్పటికప్పుడు మాత్రమే ఎందుకంటే ఇలాంటి క్రిములు అన్ని కొబ్బరినూనె ముందు ఏమాత్రం పనికిరావు.అలాగే కొబ్బరి నూనెలో విటమిన్ సి అధికంగా ఉంటుంది.ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.దీని కారణంగా కొబ్బరి నూనె ఒంటికి రాసుకుంటే చర్మం మృదువుగా ఉండడమే కాకుండా మెరిసిపోతూ ఉంటుంది.
ఇక జుట్టుకు రాసుకుంటే జుట్టు నిగారింపుగా ఉంటుంది.కాళ్లు పగుళ్లు వల్ల చాలా ఇబ్బంది పడుతున్న వారు చర్మం పొడిబారకుండా ఉండాలంటే కొబ్బరి నూనె ఉపయోగించడం ఎంతో మంచిది.
రాత్రి పూట కాళ్ల మంటలతో ఇబ్బంది పడేవారు కొబ్బరి నూనె రాసుకుంటే కాళ్ల మంట నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది.

ఇక కొబ్బరి నూనె బరువు తగ్గడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.బరువు తగ్గాలని భావించేవారు వంటలలో మంచి నూనె కు బదులుగా కొబ్బరి నూనె ఉపయోగిస్తే బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.భోజనంలో తక్కువ క్యాలరీలు తీసుకునేలాగా కొబ్బరి నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది.
కొబ్బరి నూనెతో చేసిన ఆహార పదార్థాలను తినడం వల్ల కాలానికి సంబంధం లేకుండా ఎలాంటి జబ్బులు కూడా రాకుండా ఉంటాయి.కొబ్బరి నూనె ఆహార పదార్థాలలో ఉపయోగించడం వల్ల ఆలయంలోని చెడు కూడా తగ్గి కాలయం శుభ్రం అవుతుంది.