ఎన్టీఆర్, నీల్ కాంబో మూవీ బ్యాక్ డ్రాప్ ఇదేనా.. భారీ రిస్క్ కు సిద్ధమయ్యారుగా!

ప్రస్తుతం సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ప్రశాంత్ నీల్( Prashanth Neel ) కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు సంబంధించి అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఇంకా షూటింగ్ మొదలు కాకుండానే ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో రాబోతున్న పాన్ ఇండియా మూవీ అనేక రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

 Hype For Ntr And Prashant Neel Movie Details, Jr Ntr, Prashant Neel, Tollywood,-TeluguStop.com

డ్రాగన్( Dragon ) టైటిల్ ఆల్రెడీ ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే.అయితే ఇదే పేరుని తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్( Pradeep Ranganathan ) సినిమా కోసం తమిళంలో రిజిస్టర్ చేసి పెట్టారు.

సో ఫైనల్ గా ఎవరికి దక్కుతుంది అనేది ఇప్పుడే చెప్పలేం.కానీ మాట్లాడాల్సిన సంగతులు వేరే ఉన్నాయి.

మొదటిది హీరోయిన్ ఎంపిక.

Telugu Jr Ntr, Ntr Dragon, Ntr Neel, Ntrprashanth, Prashant Neel, Rukmini Vasant

సప్త సాగరాలు సైడ్ ఏబి ఫేమ్ రుక్మిణి వసంత్( Rukmini Vasanth ) పేరు ఎక్కువగా వినిపిస్తోంది.ఈమెను తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇంకా ఖరారు చేయలేదు.

మాములుగా నీల్ సినిమాల్లో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది కానీ గ్లామర్ షోలు, డ్యూయెట్లు లాంటివి ఉండవు.శ్రీనిధి శెట్టి, శృతి హాసన్ విషయంలో చూసాము.

ఇప్పుడు వాటికన్నా మెరుగైన క్యారెక్టర్ కావడంతో పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకునే రుక్మిణిని మొదటి ఆప్షన్ గా పెట్టుకున్నట్టు తెలిసింది.రష్మిక మందన్న వైపు కూడా చూస్తున్నారట కానీ డేట్ల అందుబాటు వల్ల ఇప్పుడే ఔనా కాదా అని చెప్పలేని పరిస్థితి నెలకొంది.

ఇక బ్యాక్ డ్రాప్ విషయానికి వస్తే.

Telugu Jr Ntr, Ntr Dragon, Ntr Neel, Ntrprashanth, Prashant Neel, Rukmini Vasant

ఒకప్పుడు బంగ్లాదేశ్ లో ఇరుక్కన్న ప్రవాస భారతీయుల నేపథ్యంలో వాళ్ళను కాపాడే పవర్ ఫుల్ పాత్రలో ఎన్టీఆర్ ని చాలా గొప్పగా చూపించబోతున్నారని టాక్.బ్లాక్ టోన్ వీలైనంత తగ్గించి ఈసారి సరికొత్త నేపధ్యాన్ని పరిచయం చేయబోతున్నట్టు ఇన్ సైడ్ వర్గాల నుంచి సమాచారం.స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం లొకేషన్ లతో పాటు ఇంటీరియర్ గా వేయాల్సిన సెట్ల మీద వర్క్ షాపులు నిర్వహిస్తున్నట్టు తెలిసింది.వార్ 2 లో తన భాగం పూర్తి చేసుకుని ఎన్టీఆర్ తిరిగి వచ్చాక అటుపై నీల్ సెట్లో అడుగు పెడతాడు.2026 సంక్రాంతి విడుదలని అఫీషియల్ గా లాక్ చేసుకున్న మైత్రి మేకర్స్ సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమాలకు జరిగే జాప్యం లేకుండా పక్కా ప్లాన్ తో ఉన్నారని తెలిసింది.మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకముందే అంచనాలను భారీగా పెంచేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube