దేవర సినిమా( Devara movie ) బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా ఈ సినిమా క్లైమాక్స్ లో భారీ ట్విస్ట్ ఉంటుందని ఫ్యాన్స్ భావించారు.అయితే క్లైమాక్స్ ట్విస్టులు ప్రేక్షకులను మరీ ఎక్కువగా ఆకట్టుకోలేదు.
దేవర క్లైమాక్స్ లో బాబీ డియోల్ ఎంట్రీ ఉంటుందని భావించిన ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది.యతి పాత్రలో ఈ సినిమాలో బాబీ డియోల్ కనిపిస్తారనే చర్చ జరుగుతోంది.
దేవరకు సంబంధించి బాబీ డియోల్ సన్నివేశాలను ఇప్పటికే షూట్ చేశారట.
క్లైమాక్స్ లో బాబీ డియోల్ ( Bobby Deol )ఎంట్రీని మొదట ప్లాన్ చేసిన మేకర్స్ తర్వాత కొన్ని కారణాల వల్ల వెనక్కు తగ్గారట.సినిమాలో ఆ సన్నివేశాలు ఉండి ఉంటే మాత్రం ఆ సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచేవి.దేవర2 సినిమాకు సంబంధించి ఎలాంటి లీక్స్ ఉండకూడదని ట్విస్ట్ లు ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఉండాలని మేకర్స్ ఈ విధంగా చేశారని భోగట్టా.
దేవర సినిమా సీక్వెల్ లో 15 నుంచి 16 ట్విస్టులు రివీల్ కానున్నాయి.అయితే చాలామంది మాత్రమే దేవరను ఒక భాగంగా తెరకెక్కించి ఉంటే బాగుండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవర2 సినిమా ఎంత బడ్జెట్ తో తెరకెక్కుతుందో చూడాల్సి ఉంది.దేవర సీక్వెల్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం.
దేవర సీక్వెల్ ఎప్పుడు విడుదలైనా బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని 2028 సంవత్సరంలో ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.దేవర సీక్వెల్ లో కథ, కథనం విషయంలో మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
దేవర సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.