ముఖ్యంగా చెప్పాలంటే శివ భక్తులు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు భక్త కన్నప్ప.( Bhaktha Kannappa ) ఈయన ఆటవికుడు అయినా అణువణువునా ఈశ్వర భక్తితో జీవితం అంతా గడిపాడు.
శ్రీకాళహస్తిలోని ప్రసిద్ధ ఆలయాలలో శ్రీ భక్త కన్నప్ప స్వామి ఆలయం( Sri Bhaktha Kannappa Swamy Temple ) ఉంది అని దాదాపు చాలా మందికి తెలియదు.దీనిని స్థానికులు కన్నప్ప కొండ అని కూడా అంటూ ఉంటారు.
ముఖ్యంగా చెప్పాలంటే పురాణాల ప్రకారం కన్నప్ప ఈ కొండ పై ఉండి శివుడిని పూజించేవాడని స్థానికులు చెబుతున్నారు.అంతే కాకుండా కొండ పై ఉన్న దేవాలయానికి చేరుకోవడానికి దాదాపు 300 మెట్లు ఉన్నాయి.
అంతే కాకుండా ఈ దేవాలయానికి వెళ్లడానికి ఒక రోడ్డు మార్గం కూడా ఉంది.కానీ రోడ్డు మార్గంలో వెళ్లిన 100 మెట్లు ఎక్కి వెళ్లాల్సిందే.ఇక్కడ నుంచి శ్రీకాళహస్తీశ్వర దేవాలయ రాజగోపురం మొత్తం నాలుగు గోపురాలు, ధ్వజ స్తంభాలు, శిఖరాలు, సువర్ణ ముఖి నది వీక్షణను అందంగా చూడవచ్చు.ఇంకా చెప్పాలంటే మన భారతదేశంలోని పంచభూత శివ లింగ క్షేత్రాలలో శ్రీకాళహస్తి( Sri Kalahasthi ) ఒకటి అని కచ్చితంగా చెప్పవచ్చు.
ముఖ్యంగా చెప్పాలంటే ఐదు దేవాలయలలో నాలుగు దేవాలయాలు తమిళనాడులో ఉండగా వాయు శివలింగం శ్రీకాళహస్తిలో ఉంది.
ఇంకా చెప్పాలంటే ఈ ఆలయం అన్ని శైవ క్షేత్రాలలో చాలా విశిష్టమైనది.ఈ క్షేత్రంలోని శివ లింగం( Shiva Lingam ) నవ గ్రహ కవచంతో భక్తులను గ్రహ దోషాల నుంచి రక్షిస్తూ ఉంది.అంతే కాకుండా సర్ప దోష నివారణకు శ్రీకాళహస్తి దేవాలయంలో రాహు కేతు పూజలు నిర్వహిస్తూ ఉంటారు.
ముఖ్యంగా చెప్పాలంటే తిరుపతి నగరానికి 43 కిలో మీటర్ల దూరంలో, తిరుపతి విమానాశ్రమానికి 26 కిలో మీటర్ల దూరంలో ఈ ప్రముఖ పుణ్యక్షేత్రం ఉంది.భక్తకన్నప్ప స్వామి ఆలయం విశేషాలను ఇలా ఉన్నాయి.
ఈ దేవాలయంలో సాయంత్రం పూట కేవలం స్వామి దర్శనం మాత్రమే చేసుకోవడానికి వీలు ఉంటుంది.కానీ పూజలు, అభిషేకాలు చేయలేరు.
DEVOTIONAL