తిక్క వీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు.బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.
ఈ బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి 21వ తేదీ వరకు నిర్వహించేందుకు దేవాలయ కమిటీ నిర్ణయించింది.బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు.
పట్టణంలోని పెద్దవాగు సమీపంలో తిక్క వీరేశ్వర స్వామి నివసించి సిద్ధి పొందాడని ఇక్కడి భక్తుల విశ్వాసం.
ప్రతి సంవత్సరం ఈ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు.
జిల్లాలోని తిక్క వీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంటారు.జిల్లా నలుమూలల నుంచి భక్తులు అశేష సంఖ్యలో తరలివచ్చి తిక్క వీరేశ్వర స్వామికి పూజలు చేస్తూ ఉంటారు.
దేవాలయానికి రంగురంగుల విద్యుత్ దీపాలను అలంకరిస్తారు.భక్తుల సౌకర్యార్థం తాగునీరు, నీడ కోసం టెంట్లను ఏర్పాటు చేస్తారు.

నగరంలోని తిక్క వీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం తిక్క వీరేశ్వర స్వామి ఉత్సవ విగ్రహం ఊరేగింపు, కలశ స్థాపన రాత్రి చట్టసేవ నిర్వహిస్తారు.తొమ్మిదవ తేదీ సాయంత్రం హోమం, మరుసటి రోజు, ఉదయం నిత్య పూజలు రాత్రి 12 గంటలకు మహారాజోత్సవం నిర్వహిస్తారు.11వ తేదీన సందెరాళ్లు ఎత్తు పోటీలు,12 వ తేదీన అంతర్రాష్ట్ర భజన పోటీలు, శునకరాజముల పరుగు పందెం, 13న ఒంటెద్దు బండి గిరిగా పందెం పోటీలు, 13 నుంచి 16వ తేదీ వరకు విద్యార్థిని, విద్యార్థులకు మండలస్థాయి డాన్స్ కాంపిటీషన్, 14వ తేదీన అంతర్రాష్ట్ర పొట్టేళ్ల పోటీలు, గత సంవత్సరం పదో తరగతిలో 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులకు సత్కారం ఉంటుందని దేవాలయ కమిటీ సభ్యులు వెల్లడించారు.తిక్క వీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా 15వ తేదీ నుంచి రైతు సంబరాలు చేస్తారు.
అందులో భాగంగా 15వ తేదీన పాలపళ్ల విభాగం పశుబలా ప్రదర్శన పోటీలు,16 వ తేదీన సేద్యపుటెద్దుల విభాగం పశుబలా ప్రదర్శన పోటీలు, 17వ తేదీన సీనియర్ విభాగం పశువుల ప్రదర్శన పోటీలు నిర్వహించనున్నారు.