గుంటూరు కారం రూమర్లకు చెక్ పెట్టిన మహేష్... విడుదల అయ్యేది అప్పుడే అంటూ?

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం( Gunturu Kaaram ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా గత ఏడాది షూటింగ్ పనులను ప్రారంభించినప్పటికీ షూటింగ్ పనులు మాత్రం చాలా నత్త నడకన సాగుతున్నాయి.

 Maheshbabu First Time Open Up About Gunturu Kaaram Clarity On Release Date , Mah-TeluguStop.com

దీంతో ఈ సినిమా వచ్చేయడాది సంక్రాంతికి విడుదల కాకపోవచ్చు అనే సందేహాలు అందరిలోనూ నెలకొన్నాయి.అదేవిధంగా ఈ సినిమా గురించి ఎన్నో రకాల వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి.

మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య గొడవ జరిగిందని తమన్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నారంటూ ఈ సినిమా గురించి తరచూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

ఇలా ఈ సినిమా గురించి ఎన్నో రకాల రూమర్స్ వస్తున్నటువంటి తరుణంలో తాజాగా గుంటూరు కారం సినిమా గురించి మహేష్ బాబు మొదటిసారి స్పందిస్తూ ఈ రూమర్స్ అన్నింటికీ చెక్ పెట్టారు.ఈ సినిమా గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్న ఎప్పుడు కూడా స్పందించండి మహేష్ బాబు మొదటిసారి ఈ సినిమా గురించి వస్తున్న రూమర్లపై స్పందించారు.హైదరాబాదులో ఓ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహేష్ బాబు ఈ సినిమా విడుదల తేదీ ( Release Date ) గురించి క్లారిటీ ఇచ్చారు.

ఈ సినిమా ముందుగా అనుకున్న ప్రకారమే 2024 సంక్రాంతి పండుగ సందర్భంగా పక్కాగా విడుదల కాబోతుందని ఈయన తెలియజేశారు.

వచ్చే ఏడాది జనవరి 12వ తేదీ ఈ సినిమా తప్పకుండా విడుదలవుతుందని మీరందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అంటూ ఈయన ఈ సినిమా విడుదల తేదీ గురించి క్లారిటీ ఇవ్వడంతో మహేష్ బాబు అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.హైదరాబాదులో యాక్షన్స్ సన్ని వేషాలను చిత్రీకరించడం కోసం దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రత్యేకంగా సెట్ వేశారని ఇక్కడే ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుందని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube