రాధేశ్యామ్.ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా సినిమా.రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది.యూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద టీ సిరీస్ తో కలిసి నిర్మించారు.ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించాడు.సాహో సినిమా తర్వాత రాధేశ్యామ్ సినిమాతో జనాల ముందుకు వస్తున్నాడు.
దీంతో ఈ సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి.వరుస సినిమాలు చేస్తున్నా.
ఇప్పటి వరకు ప్రభాస్ సాహో తర్వాత కనిపించలేదు.వీరి ఎదురు చూపులకు త్వరలో బ్రేక పడనుంది.
థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ సినిమా 1960లో ఇటలీలో జరిగిన ఓ యథార్థ ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.అయితే ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.పలు రకాల కారణాలతో వాయిదా పడుతోంది.
కరోనా సహా పలు అంశాలు ఈ సినిమా విడుదలకు అడ్డంకిగా మారాయి.ఎట్టకేలకు ఈ సినిమా మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా 5 భాషల్లో విడుదల అవుతుంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త ట్రైలర్ ను ముంబైలో రిలీజ్ చేశారు.ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రభాస్ తోపాటు పూజా పాల్గొన్నారు.
అయితే అక్కడ జరిగిన ఓ సన్నివేశం అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా పూజా హెగ్డే..ప్రభాస్ తో సరిగా మాట్లాడలేదట.అంతేకాదు.
ఆయన పక్కన ఉన్నా.తనను పట్టించుకోనట్లు వ్యవహరించిందట.
ఆయన మీడియా అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్తున్నప్పుడు పూజా ఎటో చూస్తుందదట.చాలా విషయాల్లో పూజా ప్రభాస్ ను అవమానించినట్లు వ్యవహరించిందట.
వాస్తవానికి సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరికి ఏదో గొడవ జరిగిందట.అప్పటి నుంచి వీరిద్దరు అంటీముట్టనట్లే ఉంటున్నారట.
వాస్తవానికి ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా పాల్గొనని చెప్పిందట.అయితే ఫిల్మ్ మేకర్స్ తో ఉన్న ఒప్పందం మూలంగా ఆమెతో బలవంతగా ప్రమోషన్స్ చేయిస్తున్నారట.
అయితే పూజా తీరుపై అభిమానులు బాగా హర్ట్ అయ్యారట.సినిమా వెనుక ఎన్ని గొడవలు జరిగినా.
జనాల ముందుకు చూపించకూడదంటున్నారు.పూజాకు పొగరు చాలా ఎక్కువైందని మండిపడుతున్నారు.