ముఖ్యంగా చెప్పాలంటే జీవితంలో పురోగతి లేదా అభివృద్ధి సాధించడం అనేది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు అని కచ్చితంగా చెప్పవచ్చు.ఎందుకంటే కొందరు ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా అవసరానికి చేతిలో రూపాయి కూడా మిగలదు.
కొందరు సంపాదించింది తక్కువే అయినా ఎప్పుడూ వాళ్ళ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు.దీనికి కారణం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్( Financial Management ) అని కచ్చితంగా చెప్పవచ్చు.
అంటే ఎంత సంపాదించాం అనేకన్నా ఖర్చు పెట్టాల్సిన దగ్గర ఎంత జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు చేసాం అన్నదే ముఖ్యం.డబ్బు సంపాదించడం ఒక కళ అయితే అవసరమైన మేరకు ఖర్చు చేయడం మరో కళ.

ఆచార్య చాణక్యుడు( Acharya Chanakya ) తన చాణక్య నీతిలో ( Chanakya’s ethics )వ్యక్తి విజయం లేదా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే డబ్బు పొదుపు చేసే కళ ఉన్న వ్యక్తికి ఎప్పటికీ ఆర్థిక సమస్యలు ఉండవు.ఆర్థిక సమస్యలను ఎదురైన వాటి నుంచి ఎలా బయటపడాలో ఆ వ్యక్తికి బాగా తెలిసి ఉంటుంది.అలాంటివారు తక్కువ సమయంలో త్వరగా ధనవంతులవుతారు.అలాంటి వ్యక్తులు తమ జీవితంలోని ప్రతి రంగంలోని విజయం సాధిస్తారు.మన దగ్గర కాస్త డబ్బు ఉన్న, ఎక్కువ డబ్బు ఉన్న ఖర్చు చేసేటప్పుడు అవగాహనతో ఉండాలి.
ఖర్చు చేయడం లేదా దానితో మన కోరికలు తీర్చుకోవడం గురించి మనం స్పృహతో ఉండి ఆలోచన చేయాలి.

ఏ సమయంలో ఎక్కడ ఎంత డబ్బు ఖర్చు చేయాలో కచ్చితంగా తెలిసి ఉండాలి.ఆలోచించకుండా దేనికి డబ్బు ఖర్చు చేయకూడదు.మీరు ఎటువంటి కారణం లేకుండా డబ్బు ఖర్చు చేస్తే ఏదో ఒక రోజు చాలా పెద్ద సమస్యలలో పడతారు.
మీరు భవిష్యత్తులో డబ్బు సమస్యల నుంచి విముక్తి పొందాలనుకుంటే ఇప్పటి నుంచి మీ ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది.అలాగే మీ చేతిలో డబ్బు ఉన్నప్పుడు సానుకూలంగా ఆలోచించండి.
ఏదైనా మంచి ప్రాజెక్ట్ లో డబ్బు పెట్టుబడి పెట్టడం మంచిది.ఇన్వెస్ట్మెంట్ రూపంలో మీరు పొదుపు చేసిన డబ్బు ఏదో ఒక రోజు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
అయితే పెట్టుబడి పెట్టేటప్పుడు సురక్షితమైన స్థలం కోసం చూసుకొని ఆలోచించి పెట్టుబడి పెట్టాలని చాణక్య నీతిలో ఉంది.