ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ( Karthika Masam )కృష్ణ పక్షం చతుర్దశి రోజు నరక చతుర్దశిని ( Naraka Chaturdashi )జరుపుకుంటారు.ముఖ్యంగా చెప్పాలంటే పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ముందు చతుర్దశి తిది, సూర్యాస్తమయం తర్వాత అమావాస్య తిధి వచ్చినప్పుడు ఒకే రోజు నరక చతుర్దశి లక్ష్మీ పూజను కూడా చేస్తారు.
ఈ సంవత్సరం నరక చతుర్దశి నవంబర్ 11వ తేదీన జరుపుకుంటారు.నరక చతుర్దశి యమధర్మ రాజుకు అంకితం చేయబడింది.
అయితే ఈ రోజు అభ్యంగన స్నానానికి ఎంతో విశిష్టత ఉంది.మత విశ్వాసాల ప్రకారం ఈ రోజు అభయ స్నానం చేసే వ్యక్తులు నరకానికి వెళ్ళరని నమ్ముతారు.

ఈ అభ్యంగన స్నానం మతపరంగా ముఖ్యమైనది మాత్రమే కాకుండా ఇది మన శరీరానికి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను( Health benefits ) కలిగిస్తుంది.కార్తీక మాసంలో చతుర్దశి తిథి నవంబర్ 11వ తేదీన మధ్యాహ్నం ఒకటి 52 నిమిషములకు మొదలవుతుంది.ఇది నవంబర్ 12వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల 44 నిమిషాలకు ముగిసిపోతుంది.ఇంకా చెప్పాలంటే ఉదయ తిథి ప్రకారం అభ్యంగన స్నానానికి శుభ ముహూర్తం నవంబర్ 12న ఉదయం 5:28 నిమిషముల నుంచి 6:41 నిమిషముల వరకు ఉంటుంది.అలాగే ఈ రోజు చంద్రుడు( Moon ) ఉదయం 5:28 నిమిషములకే ఉదయిస్తాడని పండితులు చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే నరక చతుర్దశి రోజున లేదా దీపావళి రోజున సూర్యదాయానికి ముందే నిద్ర లేవడం మంచిదని పండితులు చెబుతున్నారు.అలాగే నువ్వుల నూనెతో( Sesame oil ) శరీరానికి మర్దన చేసి కాసేపు మెడిటేషన్ పొజిషన్ లో కూర్చోవాలి.ఆ తర్వాత పసుపు గంధం పొడి నువ్వుల పొడి పెరుగుతో తయారు చేసిన మిశ్రమాన్ని శరీరానికి అప్లై చేయడం మంచిది.
దీన్ని శరీరం పై బాగా రుద్దిన తర్వాత గోరువెచ్చని నీటితో తల స్నానం చేయాలి.ఇలా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.