చర్మం డల్ గా మారిందా? ఇలా చేస్తే క్షణాల్లో గ్లోయింగ్ గా మెరుస్తుంది!

కంటినిండా నిద్ర లేకపోవడం, ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం, కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుని పని చేయడం, కాలుష్యం తదితర కారణాల వల్ల ఒక్కోసారి ముఖ చర్మం డల్ గా మారుతుంది.అటువంటి చర్మంతో బయట కాలు పెట్టడానికి వెనకడుగు వేస్తుంటారు.

 Simple Home Remedy For Glowing Skin-TeluguStop.com

అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే సింపుల్ హోమ్ రెమెడీ కనుక పాటిస్తే క్షణాల్లో మీ చర్మం గ్లోయింగ్ గా మ‌రియు షైనీగా మారుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సింపుల్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక కప్పు గులాబీ రేకులు( rose petals ) తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కడిగి పెట్టుకున్న ఫ్రెష్ గులాబీ రేకులు వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు షుగర్( Sugar ), రెండు టేబుల్ స్పూన్లు కోకోనట్ ఆయిల్,( coconut oil ) వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత వేళ్ళతో సున్నితంగా చర్మాన్ని రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా చేస్తే చర్మం పై పేరుకుపోయిన మురికి, మృత కణాలు తొలగిపోతాయి.

డల్ గా ఉన్న చర్మం క్షణాల్లో గ్లోయింగ్ గా మరియు షైనీ గా మారుతుంది.

అలాగే స్కిన్ వైట్నింగ్ కి కూడా ఈ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.రెండు రోజులకు ఒకసారి ఈ రెమిడీ పాటిస్తే చర్మ ఛాయ అద్భుతంగా మెరుగుపడుతుంది.అలాగే తరచూ ఈ రెమెడీని ప్ర‌య‌త్నించ‌డం వ‌ల్ల‌ మొటిమలు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

చర్మం సహజంగానే అందంగా కాంతివంతంగా సైతం మెరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube