ముఖ్యంగా చెప్పాలంటే భూమి పై పుట్టిన ప్రతి మనిషికి ఎన్నో రకాల కోరికలు ఉంటాయి.అలాగే ఈ భూమిపై పుట్టిన ప్రతి మనిషికి కచ్చితంగా ఏదో ఒక రోజు చావు అనేది కచ్చితంగా వస్తుంది.
కానీ ప్రస్తుత సమాజంలోని ప్రజలకు ఇలాంటి మాటలు అంటే కాస్త చేదుగా కనిపిస్తున్నాయి.భూమిపై ఉన్న ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని కర్మల వల్ల అతను నరకానికి వెళతాడా లేదా స్వర్గానికి వెళ్తాడా అనేది నిర్ణయించబడుతుంది.
ముఖ్యంగా చెప్పాలంటే సనాతన ధర్మాలలో చూపించిన మార్గాలలో వెళ్లేవారికి ఇవి నగ్న సత్యాలుగా కనిపిస్తాయి.హిందూ ధర్మ శాస్త్రాలలో( Hindu Dharma Shastras ) పురాణాలలో ప్రస్తావించబడిన నరక లోకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే ప్రధాన లోకాలు నాలుగు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.అందులో ఒకటి బ్రహ్మ లోకం, రెండవది దేవ లోకం, మూడోది పితృ లోకం, నాల్గవది నరక లోకం అని కచ్చితంగా చెప్పవచ్చు.అలాగే మనిషి తను మరణించిన తర్వాత తను చేసిన మంచి చెడుల వల్ల ఇందులోనే ఏదో ఒక లోకానికి వెళ్తాడని కచ్చితంగా చెప్పవచ్చు.ఈ లోకాల ప్రయాణం ఎలా ఉంటుందంటే జీవించి ఉన్నప్పుడు చేసిన పాపపుణ్యాల ఫలితంగానే ఆయా మార్గాల గుండా వారి ఆత్మ ప్రయాణం కొనసాగుతుంది.

అయితే అందులో కూడా కొన్ని ముఖ్యమైన మార్గాలు ఉన్నాయి.ముఖ్యంగా చెప్పాలంటే అర్చి మార్గం , ధూమ మార్గం, వినాశన మార్గం( path of archi, path of smoke, path of destruction ) అని వీటికి పేర్లు ఉన్నాయి.ఇంకా చెప్పాలంటే ఆర్చి మార్గం అంటే వెలుతురు దారి బ్రహ్మ లోకం, దేవ లోకం వెళ్లడానికి దారి చూపిస్తుంది.అలాగే ధూమ మార్గం పితృలోకానికి దారి చూపిస్తుంది.
వినాశ మార్గం నరకానికి దారి చూపిస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే ధర్మాన్ని, దైవాన్ని దూషించేవారు,అలాగే మత్తులో ఉండేవారు, చెడ్డ పనులు చేసేవారు కచ్చితంగా నరకానికి వెళ్తారని పండితులు చెబుతున్నారు.
అందువల్ల ఇలాంటి పనులకు దూరంగా ఉండి జీవితం లో పుణ్యఫలాలు చేసుకోవడం ఎంతో మంచిది.ఎందుకంటే ఈ భూమిపై ఎవ్వరు శాశ్వతం కాదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.
DEVOTIONAL







