హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది మాఘమాసంలోని కృష్ణ పక్షంలోని 11 వ రోజున షట్టిల ఏకాదశినీ ( Shattila Ekadashini ) జరుపుకుంటారు.అయితే షట్టిల ఏకాదశి రోజు కొన్ని పనులు చేస్తే విశేషమైన ఫలితాలు వస్తాయని, అలాగే సంపద, శ్రేయస్సు పెరుగుతుందని చెబుతున్నారు.
మాఘమాసంలో విష్ణువుకు ప్రత్యేకమైన స్థానం ఉంది.షట్టిల ఏకాదశి రోజు విష్ణుమూర్తిని( Lord Vishnu ) ఎవరైతే పూజించి షట్టిల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
ఈ వ్రతం బంగారాన్ని దానం చేసినంత, వేలా సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యఫలితాన్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు.
ఎవరైతే ఈ రోజు శ్రీమహావిష్ణువుని నిష్టతో ఆరాధిస్తారో వారికి భవిష్యత్తు అంతా శుభదాయకంగా ఉంటుందని చెబుతున్నారు.షట్టిల ఏకాదశి వ్రతంలో భాగంగా ఉపవాసం చేయడం వల్ల సత్ఫలితాలు పొందవచ్చని చెబుతున్నారు.షట్టిల ఏకాదశి వ్రతంలో భాగంగా కొన్ని పనులను చేయాలి.
కొన్ని పనులను అసలు చేయకూడదు.మరి ఆ పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఏకాదశి సందర్భంగా చేయవలసిన పనులలో విష్ణుమూర్తికి నువ్వులను( Sesame ) సమర్పించి ఆ నువ్వులను ప్రసాదంగా తీసుకోవాలి.పొరపాటున కూడా నువ్వులను కిందపడకుండా చూసుకోవాలి.
పాదాలకు నువ్వులు తాగితే మహా పాపం అని పండితులు చెబుతున్నారు.షట్టిల ఏకాదశి ఉపవాస కాలంలో బియ్యం, ఉప్పు, నూనె ( Rice, salt, oil )వినియోగానికి దూరంగా ఉండాలి.పప్పు, తేనె వంటి వాటిని అసలు తీసుకోకూడదు.అలాగే విశేషమైన ఫలితాలు పొందడం కోసం నువ్వులను దానం చేయాలి.నెయ్యి దీపాలతో విష్ణువుకు హారతి ఇవ్వాలి.ఈ విధంగా చేస్తే సంపద మరియు శ్రేయస్సు పెరుగుతుంది.
విష్ణు మంత్రమైన ఓం మాధవాయ నమః 21 సార్లు జపిస్తే ఆదాయం పెరుగుతుంది.ఏకాదశి రోజున పంచామృతంలో నువ్వులను కలిపి విష్ణుమూర్తికి సమర్పిస్తే జీవిత భాగస్వామితో సంతోషకరమైన జీవితం ఉంటుంది.
కాబట్టి ఈ ఏడాది అంతా విష్ణువు అనుగ్రహంతో సంతోషంగా ఉండాలంటే తప్పనిసరిగా ఈ పనులను చేయాలి.
LATEST NEWS - TELUGU