వేసవిలో ఉదయం ఈ ప్రోటీన్ స్మూతీని తీసుకుంటే ఇక మీకు తిరుగే ఉండదు!

వేసవికాలం రానే వచ్చింది.మార్చి నెల ప్రారంభం నుంచే ఎండలు మండిపోతున్నాయి.

 Consuming This Protein Smoothie In Summer Is Good For Health! Protein Smoothie,-TeluguStop.com

వేసవి వేడికి నీరసం అలసట వంటివి తీవ్రంగా మదన పెడుతుంటాయి.వీటి కారణంగా పనిపై ఏకాగ్రత దెబ్బ తింటుంది.

కానీ ఇప్పుడు చెప్పబోయే ప్రోటీన్ స్మూతీని ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే ఇక మీకు తిరుగు ఉండదు.రోజంతా హైపర్ యాక్టివ్ గా ఉంటారు.

అలాగే ఈ స్మూతీని తీసుకోవడం వల్ల మరిన్ని బెనిఫిట్స్ సైతం లభిస్తాయి.ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రోటీన్ స్మూతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ సబ్జా గింజలు( Basil Seeds ) వేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి.మరోవైపు బ్లెండర్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు సత్తు పౌడర్ వేసుకోవాలి.

ఆ తర్వాత పీల్ తొలగించిన రెండు సపోటా పండ్లను వేసుకోవాలి.ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్‌ పెరుగు, వన్ టేబుల్ స్పూన్ మునగాకు పొడి, పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి(Cardamom ), ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలను మిక్స్ చేస్తే మన స్మూతీ రెడీ అయినట్లే.ఈ ప్రోటీన్ స్మూతీ టేస్ట్ గా ఉండడమే కాదు వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఈ ప్రోటీన్ స్మూతీని తీసుకుంటే రోజంతా యాక్టివ్ గా, ఎనర్జిటిక్ గా ఉంటారు.నీరసం అలసట వంటివి ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

వడదెబ్బ బారిన పడకుండా ఉంటారు.బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది.మెదడు సూపర్ షార్ప్ గా పనిచేస్తుంది.వెయిట్ లాస్ అవుతారు.గుండెపోటు వచ్చే రిస్క్ తగ్గుతుంది.మరియు హెయిర్ ఫాల్( Hair fall ) సైతం కంట్రోల్ అవుతుంది.

కాబట్టి తప్పకుండా వేసవిలో ఉదయం ఈ ప్రోటీన్ స్మూతీని తీసుకునేందుకు ట్రై చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube