ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలలో అధిక బరువు( Overweight ) అతి పెద్ద సమస్యగా మారిపోయింది.అధిక బరువును దూరం చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు చాలా రకాల కసరత్తులను చేస్తున్నారు.
అలాగే ఎన్నో రకాల ఆయుర్వేద చికిత్సలను( Ayurvedic treatments ) కూడా తీసుకుంటున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే చియా విత్తనాలు( Chia seeds ) చాలా చిన్నగా ఉంటాయి.
కానీ ఇవి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి.ఈ గింజలలో అధిక పోషకాలతో పాటు మంచి ఆరోగ్య ప్రయోజనాలను ఉన్నాయి.
ఈ గింజలు కొలెస్ట్రాల్ ను తగ్గించడం దగ్గర నుంచి అందాన్ని పెంచే వరకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తూ ఉంటాయి.
అందువల్ల చియా విత్తనాలు సూపర్ ఫుడ్ గ్రూప్ కి చెంది ఉంటాయి.ఈ గింజలు మీరు ఊహించని దానికంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.అలాగే ఇవి మన శరీరంలోని ఆక్సికరణ ఒత్తిడిని కూడా అదుపులో ఉంచుతాయి.
సెల్ డామేజ్ ను కూడా నివారిస్తాయి.వివిధ రకాల గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి.
కొన్ని రకాల క్యాన్సర్లను కూడా దూరం చేస్తాయి.ముఖ్యంగా రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ విత్తనాల నీటిని తాగితే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.
ఆ ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే చీయ గింజలు శరీరానికి పెద్ద మొత్తంలో పీచు పదార్థాలను అందిస్తాయి.దీనివల్ల కడుపులో ఆకలిగా అనిపించదు.అతిగా తినే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.అలాగే గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది.జీవక్రియ కూడా మెరుగుపడుతుంది.
ఇది మన శరీర ఆరోగ్యాన్ని పెంచి మలబద్దక సమస్యల ( Constipation problems )నుంచి దూరం చేస్తుంది.చియా గింజలలో అధికంగా ఫైబర్ ఉంటుంది.
ఇది అధిక రక్తపోటును కూడా దూరం చేస్తుంది.అలాగే గుండె జబ్బులను కూడా రాకుండా చేస్తుంది.
ఉదయాన్నే పరిగడుపుతో చీయా గింజలు నానబెట్టిన నీటిని తాగడం వల్ల శరీరంలో మంట సమస్య కూడా దూరమవుతుంది.కాబట్టి చియా గింజలు నానబెట్టిన నీటిని రోజు తాగడం వల్ల శరీరంలోని వాపు కూడా తగ్గుతుంది.
ముఖ్యంగా అధిక బరువు సమస్యను నివారించడంలో చియా గింజలు కీలక పాత్ర పోషిస్తాయి.