సమ్మర్ సీజన్ రానే వచ్చింది.రోజురోజుకు సూర్యుడి ప్రతాపం పెరుగుతోంది.
ఈ సీజన్‌లో ఆరోగ్యాన్ని ఎంత పదిలంగా కాపాడుకోవాలో ఏ ఒక్కరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ఎండల దెబ్బకు డీలా పడిపోతారు.
అయితే ఈ సీజన్‌లో కొన్ని కొన్ని ఆహారాలు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి.అలాంటి వాటిలో రాగి జావ ఒకటి.
అవును, ఈ వేసవి కాలంలో ప్రతి రోజు ఒక కప్పు రాగి జావ తీసుకుంటే అనేక హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు.
ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ప్రధానంగా వేధించే వడదెబ్బ నుంచి రక్షించడం లో రాగి జావ అద్భుతంగా సహాయపడుతుంది.
వేడిని తగ్గించి శరీరాన్ని చల్ల బరుస్తుంది.అలాగే ఈ సీజన్‌లో తరచూ అలసట, నీరసానికి గురవుతుంటారు చాలా మంది.
అయితే రాగి జావ తీసుకోవడం వల్ల అందులో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ శరీరానికి కావాల్సిన శక్తిని అందించి నీరసం, అలసట వంటి సమస్యలను దూరం చేస్తుంది.
బరువు తగ్గాలని ప్రయత్నించే వారు గోధుమ పిండితో తయారు చేసిన చపాతీలను తీసుకుంటారు.కానీ, ఈ వేసవిలో గోధుమ పిండిని పూర్తిగా ఎవైడ్ చేసేయాలి.దాని బదులుగా రాగి జావ తీసుకుంటే మంచిది.
రాగి జావలో కెలరీలు తక్కువగా ఉంటాయి.పైగా శరీర కొవ్వు కూడా కరుగుతుంది.
రాగి జావ రెగ్యులర్‌గా తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది .
ఇక రాగి జావ చేయడం చాలా సులువు.ముందుగా గిన్నెలో నీళ్లు పోసి మరిగించాలి.ఆ మరిగే నీటిలో రాగి పిండిని వేసి ఉండలుకట్టకుండా కలుపుతూ నాలుగు లేదా ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.అనంతరం అందులో మజ్జిగ, ఉప్పు కలుపుకుంటే రాగి జావ రెడీ.మజ్జిగ, ఉప్పు కు బదులుగా పాలు, బెల్లం అయినా కలుపుకుని తీసుకోవచ్చు.
ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే.
.