కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? అయితే వీటిని ఆహారంలో భాగం చేసుకోండి..!

వయసు పెరిగే కొద్దీ కీళ్ల నొప్పుల సమస్య( Joint pain problem ) సాధారణంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.కానీ కొన్నిసార్లు మారుతున్న వాతావరణం వల్ల కూడా ఈ సమస్య పెరుగుతుంది.

 Suffering From Joint Pain? But Make These Part Of The Diet , Health , Health T-TeluguStop.com

ప్రస్తుతం చలికాలం కొనసాగుతుంది.కొంతమంది కీళ్ల నొప్పులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

చలికాలంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం వల్ల కండరాల తిమ్మిరి సమస్య కూడా ఉంటుంది.అంతేకాకుండా శీతాకాలంలో తక్కువ సూర్యకాంతి కారణంగా శరీరంలో విటమిన్ డి స్థాయి కూడా తగ్గిపోతుంది.

ఇది ఎముకలను దెబ్బతీస్తుంది.చల్లని వాతావరణం లో కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి మీరు మీ ఆహారంలో కొన్ని రకాల ఆహారాలను చేర్చుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Telugu Almonds, Fatty Acids, Fish, Flax Seeds, Green Tea, Tips, Pain Problem, Ol

కొవ్వు చేపలు తినడం వల్ల నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.కొవ్వు చేపలలో కొవ్వు ఆమ్లాలు, విటమిన్ బి ఎక్కువగా ఉంటాయి.ఇవి యాంటీ బ్యాక్టీరియా లక్షణాలను కూడా కలిగి ఉంటాయి.మీరు శీతాకాలంలో కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతుంటే కొవ్వు చేపలను తప్పకుండా తినాలి.నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి ఇది ఒక ఎఫెక్టివ్ రెమిడి అని కచ్చితంగా చెప్పవచ్చు.అలాగే ఆలివ్ ఆయిల్( Olive oil ) అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకునే వారికి మధుమేహం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.

అంతేకాకుండా కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.అలాగే నట్స్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.

అంతేకాకుండా ఫైబర్ ప్రోటీన్ గొప్ప మూలం.

Telugu Almonds, Fatty Acids, Fish, Flax Seeds, Green Tea, Tips, Pain Problem, Ol

దీని కోసం మీరు ప్రతి రోజు అవిసె గింజలు( Flax Seeds ), బాదం, వాల్నట్స్, పిస్తా పప్పులు మొదలైన వాటిని తింటూ ఉండాలి.అలాగే శీతాకాలంలో రోజు గ్రీన్ టీ( Green tea ) తాగుతూ ఉండాలి.ఇది వాపును తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఇంకా చెప్పాలంటే వెల్లుల్లి, ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.మీరు దీన్ని అనేక విధాలుగా ఆహారంలో ఉపయోగించవచ్చు.

అంతేకాకుండా మీరు ఆవాల నూనెలో వెల్లుల్లిని వేయించి ప్రభావిత ప్రాంతంలో మసాజ్ కూడా చేయవచ్చు.దీని వల్ల కూడా నొప్పి నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube