ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికి కారు ఉండడం సర్వసాధారణంగా మారిపోయింది.కార్లు కేవలం హోదాకు సంబంధించిన అంశమే కాకుండా కారు జీవితంలో ముఖ్యమైన భాగం అయిపోయింది.
సాధారణంగా మనం కారు కొనుగోలు చేసేటప్పుడు దాని రంగు, నంబర్, కంపెనీ ( Color, Number, Company )లేదా మంచి రోజు తో పాటు మంచి సమయాన్ని కూడా చూస్తూ ఉంటాం.అయితే కారు కొన్న తర్వాతే వాస్తు గురించి మర్చిపోతాం.
వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేక వస్తువులను కారులో ఉంచాలి.అలాగే కొన్ని వస్తువులను కారులో ఉంచకూడదు.
కాబట్టి కారు వాస్తు ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా మంది కారు కొన్న తర్వాత తమ కారులో దేవుని ఫోటో( photo of God ) లేదా విగ్రహాన్ని పెడతారు.ముఖ్యంగా చెప్పాలంటే కారులో వినాయకుడి విగ్రహం ఉంటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశలు కూడా తగ్గుతాయి.
అలాగే గణపతి అన్ని అడ్డంకులను తొలగిస్తాడని ప్రజలు నమ్ముతారు.మీరు చాలా కార్లపై టిబెటన్ జెండాను చూస్తారు.
ఇది చాలా మంచి శక్తి ప్రవాహాన్ని కలిగిస్తుంది.కారు రన్నింగ్ లో ఉన్నప్పుడు చుట్టూ సానుకూల శక్తిని సూచిస్తుంది.

కారులో ఎప్పుడూ వాటర్ బాటిల్ ఉంచుకోవాలని వాస్తు శాస్త్రం( Vastu Shastra ) చెబుతోంది.నీటి మూలకం కారులో ఉంటే అది అదృష్టాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది.అలాగే ఇది కారులోని చెడు శక్తిని దూరం చేస్తుంది.అలాగే కారులో తాబేలు మరియు చైనీస్ నాణేలు( Chinese coins ) ఉంచడం కూడా ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇది కారు డిజైన్, రంగు,అంతర్గత, బాహ్య సమతుల్యతను రక్షిస్తుంది.అలాగే చెడు శక్తులను దూరం చేస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే ఎట్టి పరిస్థితులలోనూ పగిలిన వస్తువులను కారులో ఉంచకూడదు.కారు కిటికీలు, కార్పెట్ సీటు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
లేదంటే కారులో నెగిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.