సనాతన ధర్మంలో హిందువులు జ్యోతిష్య శాస్త్రం(Astrology), వాస్తు శాస్త్రం మాదిరిగా కొన్ని శకునాలను కూడా నమ్ముతారు.ఆ శకునాలు భవిష్యత్తును సూచిస్తాయని మార్పును సూచించే సంకేతాలుగా చాలా మంది నమ్ముతూ ఉంటారు.
ఇక వీటిలో మంచి శకునాలు, అపశకునాలు కూడా ఉంటాయి.పిల్లి(Cat) ఎదురు వచ్చినా,ఎవరైనా తుమ్మినా కొంత సమయం పాటు ఇంటి బయటకు వెళ్లకూడదని, చాలా మంది ప్రజలు నమ్ముతారు.
అలాగే భర్త చనిపోయిన మహిళ ఎదురుపడిన అ శుభమని ఇప్పటికి చాలామంది ప్రజలు నమ్ముతారు.ఇక కుక్కలు ఏడిస్తే ఏదో చెడు జరుగుతుంది అని, ఇంట్లోకి గబ్బిలం వచ్చిన అరిష్టం జరుగుతుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.అంతే కాకుండా మహిళలకు కుడి కన్ను(right eye) అదిరితే అరిష్టమని, మగవారికి ఎడమ కన్ను (left eye)అదిరితే దరిద్రం అని చెబుతూ ఉంటారు.ఇలా కుడి కన్ను అదిరితే ఒక అర్థం, ఎడమ కన్ను అదిరితే మరో అర్థం ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
స్త్రీ పురుషులకు ఏ కన్ను అదిరితే మంచిది, ఏ కన్ను అదిరితే మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆడవారిలో కుడి కన్ను అదిరితే దురదృష్టమని జ్యోతిష్య శాస్త్రంలో ఉంది.ఇంకా చెప్పాలంటే మహిళలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది.ముఖ్యంగా చెప్పాలంటే మగవారిలో కుడి కన్ను అదిరితే చిరకాల వాంఛ త్వరలో నెరవేరుతుందని వారికి ఇష్టమైన వారిని కలవడం లేదా వారికి ఏదైనా అదృష్టం కలిసి రావడం జరుగుతుందని పెద్దవారు చెబుతూ ఉంటారు.
అంతే కాకుండా సంపద వస్తుందని కూడా మరి కొంత మంది చెబుతూ ఉంటారు.అదే మగ వారిలో ఎడమ కన్ను అదిరితే ఊహించని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని పూర్వీకుల కూడా నమ్మకం.