జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ప్రాణహాని ఉందని మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి అన్నారు.ఆయనను వైసీపీ ఏమైనా చేస్తుందని ఆరోపించారు.
పవన్ రాజకీయంగా ఎదుగుతుంటే తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు.పవన్ కల్యాణ్ భద్రత విషయంలో బీజేపీ కేంద్ర పార్టీ జోక్యం చేసుకోవాలని కోరారు.
ఈ క్రమంలోనే జనసేనానికి వై కేటగిరీ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడిన తీరుతో వైసీపీ భయపడిందన్నారు.
జగన్ ఆలోచన విధ్వంసరచన అని ఆరోపించారు.







