మన ఇంట్లో ఉండే మసాలా దినుసులలో జాజికాయ( nutmeg ) కచ్చితంగా ఉంటుంది.జాజికాయను ఎంతో కాలంగా మనం వంట గదిలో ఉపయోగిస్తూ ఉన్నాము.
మసాలా వంటకాలలో జాజికాయను లేదా జాజికాయ పొడి వేయడం వల్ల అవి మరింత రుచిగా తయారవుతాయి.వంటలకు రుచి ఇవ్వడంతో పాటు జాజికాయలను ఉపయోగించడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.
ముఖ్యంగా జాజికాయ పాలను రాత్రి పూట తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.జాజికాయ పాలు, వీటినే జైఫాల్ దూద్( Jaifal Dudh ) అని కూడా పిలుస్తారు.
ఈ పాలను రాత్రిపూట తీసుకోవడం వల్ల మనం చక్కటి నిద్రతో పాటు అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

రాత్రి పూట జాజికాయ పొడి పాలను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు( Health benefits ) ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.జాజికాయలో మనసును, శరీరాన్ని శాంతపరిచే గుణాలు ఎక్కువగా ఉంటాయి.జాజికాయ పాలను తీసుకోవడం వల్ల మనసుకు చక్కటి విశ్రాంతి లభిస్తుంది.
మంచి నిద్రకు కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.ఈ పాలను తీసుకోవడం వల్ల నాణ్యమైన, లోతైన నిద్రను పొందవచ్చు.
అలాగే ఒత్తిడి, ఆందోళన నుంచి త్వరగా బయటపడవచ్చు.రాత్రి సమయంలో జాజికాయ పాలను తీసుకోవడం వల్ల పొట్ట సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
అలాగే ఈ పాలు తీసుకోవడం వల్ల మెదడు చక్కగా పనిచేస్తుంది.అంతే కాకుండా నిద్రలేమి సమస్యలతో( insomnia problems ) బాధపడేవారు క్రమం తప్పకుండా జాజికాయ పాలను తీసుకోవడం వల్ల మీ ఆరోగ్య సమస్య దూరం అవుతుంది.

జాజికాయ పాలను తీసుకోవడం వల్ల శరీరంలో మంట, వాపు కూడా తగ్గుతాయి.శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.అంతేకాకుండా జాజికాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది.గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.దీన్ని తీసుకోవడం వల్ల క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్స్, పోషకాలు కూడా శరీరానికి అందుతాయి.
మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ జాజికాయ పాలను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా జాజికాయలను బండపైన నీటి సహాయంతో రాస్తూ మెత్తని పేస్టులాగా చేసుకోవాలి.ఈ పేస్టు చిటికెడు మొత్తంలో తీసుకుని గోరువెచ్చని పాలలో కలిపి తీసుకోవాలి.
ఇందులో తేనెను కూడా కలిపి తీసుకోవచ్చు.ఈ విధంగా జాజికాయ పాలను తయారు చేసి తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.